దేశాన్ని అవమాన పరిచే విధంగా మాట్లాడిన సుజన చౌదరి

రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని అప్పుడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది పథంలో నడుస్తాయని మెజారిటి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. మరి కొంతమంది మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు ఎన్నో ఆశలతో ప్రభుత్వానికి భూములు ఇచ్చారని వికేంద్రికరణ పేరుతో వారికి అన్యాయం చేయడం తగదని చెప్పుకొస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు రాజధాని పూర్తిగా అమరావతి నుండి తీసివేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించలేదు. రాజధానిగా అమరావతి కుడా ఉంటుంది అని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. రాజకీయాలకు అలవాటు పడిన కొంతమంది ప్రభుత్వ ప్రకటనను తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రం నుండి అమరావతిని వెలివేయబోతున్నారు అన్నంతగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టడం చూస్తూనే ఉన్నాం.

Read Also: సుజనా చౌదరి మీద చర్యలు తీసుకుంటారా?

అయితే తాజాగా ఈ కోవలోకి మాజీ తెలుగుదేశం ముఖ్యనేతగా ఉండి ప్రస్తుత బి.జే.పి నేతగా మారిన రాజ్య సభ సభ్యులు సుజనా చౌదరి వచ్చి చేరారు. మొదటి నుండి భారతీయ జనతాపార్టి ముఖ్య నాయకులు జగన్ తీస్కున్న నిర్ణయాన్ని స్వాగతిస్తే ప్రస్తుతం బి.జే.పిలో ఉన్న తెలుగుదేశం పాత మిత్రులు మాత్రం జగన్ చర్యను ఖండిస్తున్నారు. అయితే సుజనా చౌదరి రాజధానిపై మాట్లాడుతు చేసిన వాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. అమరావతి లో ఏదో జరిగిపోతునట్టు, అంతర్యుద్దం జరుగుతున్నటు దేశంలోని అన్ని ప్రాంతాలకు తప్పుడు సంకేతాలు వెళ్ళేలా మాట్లాడారు. అమరావతిలో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని , ఒక వేళ ప్రజలు దీనిని చూస్తు ఊరుకుంటే ఇక ఈ దేశంలో పౌరుడిగా ఉండటమే అనవసరమని కాందీశీకుడిగా వేరే దేశానికి వెళ్ళిపోవటం మంచిదని దేశాన్నే కించపరిచే విధంగా మాట్లాడారు. ఒక ఎం.పి గా ఉంటూ దేశంపై సుజనా చేసిన ఈ ప్రకటనలతో బి.జే.పి నేతలు సైతం అసహనంగా ఉన్నారు.

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొటిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా అభివృద్ది వికేంద్రికరణను విమర్శిస్తు ఇలా దేశాన్నే వదిలి పోతా అంటూ చేసిన వ్యాఖ్యలు హర్షనీయం కాదు. దేశాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న సుజనా ప్రకటనలపై బి.జే.పి నేతలు సైతం అసంతృప్తి గా ఉన్నట్టు తెలుస్తోంది . 107 కోట్లు అప్పు చేసి బోర్డు తిప్పేసిన వ్యక్తి కూడా రాజధాని విషయంపై మాట్లాడటం కేవలం రాజకీయ లబ్ది పొందేందుకే అని చెబుతున్నారు. అమరావతిలొ ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తనకి వచ్చిన వాటాని కాపాడుకునేందుకే అని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైన ఎంపీగా ఉంటూ దేశం విడిచి పొతా అని బాధ్యతా రహితంగా మాట్లాడిన సుజన క్షమాపణలు చెప్పాలి అనే డిమాండ్ సోషల్ మీడియాలో వినపడుతోంది

Show comments