iDreamPost
iDreamPost
ఇది సినిమాటిక్ గా కనిపించే దొంగతనం. కాకపోతే అంతా ఒరిజినల్. చాలా రిస్కీ. రైలు నదిపై బ్రిడ్జ్ దాటుతోంది. ఇద్దరు కుర్రోళ్లు రైలు తలుపు దగ్గర కూర్చున్నారు. ఓ కుర్రాడి ఫోన్ చూస్తున్నాడు. అదికాస్తా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. మాయం.
అలాగని ఫోన్ నదిలో పడిపోలేదు. బ్రిడ్జి మీదున్న ఓ దొంగ… రెప్పపాటులో వేగంగా వెళ్తున్న రైలులోని ఫోన్ కొట్టేశాడు. అతను బ్రిడ్జి రెయిలింగ్ మీదనున్నాడు. స్పైడర్ మ్యాన్‌లా వేలాడుతూ, ప్రయాణికుడి చేతిలోని ఫోన్ లాగేశాడు. అంతే ఆ కుర్రాడు షాక్. ఏం జరిగిందో అర్ధంకాలేదు. బిక్కముఖం వేశాడు. తన ఫోన్‌ను బ్రిడ్జి మీద ఉన్న వ్యక్తి కొట్టేశాడని పది నిమషాలకు కాని తెలుసుకోలేకపోయాడు.
బిహార్‌లోని బెగూసరాయ్‌లో 20కిలోమీటర్ల స్సీడులో వెళ్తున్న రైల్లో ఈ దొంగతనం జరిగింది. బ్రిడ్జిని ఫోన్ లో షూట్ చేస్తున్న వాళ్లకు ఈ వీడియో చిక్కింది. లేదంటే ఇలా దొంగతనం జరిగిందంటే ఏవరూ నమ్మరు. లేదంటే ఆ కుర్రాడే ఫోన్ ను నదిలో పడేసుకున్నాడేమోనని అనిపిస్తుంది. దానికితోడు దొంగకూడా స్పైడర్ మేన్ లా ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Sitting at the gate can be injurious for you and your phone !! 😂😂
नज़र हटी
दुर्घटना घटी! #snatchers #ViralVideo #phonetheft #begusarai #WestBengal pic.twitter.com/HyBSMuiIlU— Vaibhav Mishra (@just_vaibhav_) June 9, 2022