iDreamPost
android-app
ios-app

Ram Pothineni : సరిలేరు…”రామ్” కి ఎవ్వరు..

  • Published Nov 30, 2021 | 6:50 AM Updated Updated Nov 30, 2021 | 6:50 AM
Ram Pothineni : సరిలేరు…”రామ్” కి ఎవ్వరు..

రామ్ పోతినేని.. సినిమా కోసమే పుట్టారేమో అన్నట్టుగా, విభిన్నమైన నటనతో..డాన్స్ లతో స్క్రీన్ మీద కనువిందు చేస్తాడు ఈ హీరో.

హిట్లు..ప్లాపులతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఎనలేని స్టార్ డం ని సంపాదించుకున్నాడు. కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా..ఆఫ్ ది స్క్రీన్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు.. కష్టం అని ఎవరైనా వస్తే నిమిషం కూడా ఆలోచించకుండా ఆదుకుంటాడు. “కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు” అనే సామెత రామ్ కి సరిగ్గా వర్తిస్తుంది.

కేవలం సినిమా ప్రపంచమే కాకుండా..సామాజిక బాధ్యతగా ఎంతో మందిని ఆదుకున్నాడు..బయటకి వచ్చినవి కొన్ని మాత్రమే అయితే..బయట పెట్టనివి మరెన్నో…..

ఆ మంచి తనం వల్లే నేమో, ఆయన్ని సినిమా పరంగా మాత్రమే కాకుండా.. వ్యక్తిత్వం పరంగా కూడా అభిమానించే వాళ్ళు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆ అభిమానమే నేడు యూట్యూబ్ లో ఆయన్ని సౌత్ ఇండియాలోనే నెం.1 స్థానంలో నిలబెట్టింది. 1.23 మిలియన్ SUBSCRIBERS తో తొలిస్థానంతో దూసుకుపోతున్నాడు ఈ ఉస్తాద్. అయనకి సంబంధించిన సినిమా అయినా..పాట అయినా విడుదల చేస్తే, అతి కొద్ది సమయంలోనే కోట్లలో వ్యూస్ వస్తాయి. కేవలం సౌత్ ఇండియా లోనే కాకుండా, నార్త్ ఇండియాలో కూడా నెం.1 తెలుగు హీరోగా నిలిచాడు. ఇప్పటి వరకు ఒక్క హిందీ సినిమా చేయకుండానే, నార్త్ ఇండియాలో ఇలాంటి ఘనత మరే హీరోకి దక్కలేదు. అది ఆయనకి ఉన్న క్రేజ్.

ఫ్యాన్స్ ని తన సొంత కుటుంబంలా భావించే ఈ హీరో, తనని అభిమానించే వారి ఆనందం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. రూమర్స్ కి..వివాదాలకి దూరంగా..అభిమానించే వారి హృదయాలకు దగ్గరగా ఉంటాడు రామ్. అందుకే, ఆయన మంచితనానికి – నెలకొల్పే రికార్డులకి “సరిలేరు ఎవ్వరు”.

ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు రామ్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అతి త్వరలో రామ్ ఈ సినిమా యొక్క తదుపరి షెడ్యూల్ లో పాల్గొననున్నాడు.