iDreamPost
iDreamPost
బర్త్ డే పార్టీకి వచ్చిన రిచ్ మామ ఇంటికే కన్నం వేశాడో అల్లుడు. ఫ్రెండ్స్ తో కలసి మామ బంగారాన్ని దోచుకున్నాడు.
సైదాబాద్, కుర్మగూడకు చెందిన యాసిర్ ఉల్లిఖాన్ 31న తన బర్త్ డేకి మామను పిలిచాడు. అతిధి మర్యాదలు చేశాడు. అల్లుడి బర్త్ డేకి మామ ఘనంగా వచ్చాడు. రింగ్ లు, చైన్, కాస్ట్లీ వాచ్ వేసుకున్న మామపై అల్లుడికి అసూయపుట్టింది. ఒంటిమీద ఇంతుంటే ఇంట్లో ఇంకెంత ఉండాలనుకొని మామ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. వాటాలిస్తానని ఫ్రెండ్స్ మహ్మద్ అయ్యాజ్ ఖాన్, హమ్దాన్ అశ్వాక్లను కలుపుకున్నాడు. వాళ్లతోనే దొంగతనం చేయించడానికి ప్లాన్ వేశాడు.
బర్త్ డే పార్టీ అయిన వెంటనే 31న అశ్వాక్ బురఖా వేసుకొని అయాజ్ ఖాన్ బైక్‌పై మీర్‌పేటలోని షరీఫ్‌నగర్‌లోని, ఉల్లిఖాన్ మామ ఇంటి దగ్గరకెళ్లారు. బయట అయాజ్ కాపు కాస్తుంటే, అశ్వాక్ ఇంటి అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. స్క్రూడ్రైవర్‌తో మొదటి, రెండో అంతస్తులోని అల్వారాలను తెరిచి, అందులోని సొత్తును ఎత్తుకెళ్లాడు.
లబోదిబోమన్న బాధితుడి ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా కనిపించిన అల్లుడు, అతని మిత్రబృందాన్ని పట్టుకున్నారు. అశ్వాక్, అయాజ్, ఉల్లిఖాన్ల నుంచి రూ.33.02 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం ఆభరణాలు, 9 వాచ్ లు, 405 అమెరికన్ డాలర్లు, బైక్, సెల్‌ఫోన్, డిజిటల్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.