iDreamPost
బయటికి వెళ్లి సమయంతో పాటు డబ్బులు ఏం ఖర్చు పెడతాంలే అనుకునే వాళ్ళ కోసం స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ క్రమం తప్పకుండా వస్తూనే ఉంది.
బయటికి వెళ్లి సమయంతో పాటు డబ్బులు ఏం ఖర్చు పెడతాంలే అనుకునే వాళ్ళ కోసం స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ క్రమం తప్పకుండా వస్తూనే ఉంది.
iDreamPost
థియేటర్ తో పాటు ప్రతి శుక్రవారం నుంచి ఆదివారం దాకా ఓటిటిలో ఏమేం కొత్త కంటెంట్ వస్తుందో ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటికి వెళ్లి సమయంతో పాటు డబ్బులు ఏం ఖర్చు పెడతాంలే అనుకునే వాళ్ళ కోసం స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ క్రమం తప్పకుండా వస్తూనే ఉంది. అవేంటో చూద్దాం. ఎల్లుండి 9న అమెజాన్ ప్రైమ్ లో ‘సీతారామం’ స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలున్నాయి. హన్సిక శింబుల డబ్బింగ్ మూవీ ‘మహా’ని ఆహాలో వదులుతున్నారు. 11న రియాలిటీ షో ‘డాన్స్ ఐకాన్’ని చాలా గ్రాండ్ గా ఆహాలోనే లాంచ్ చేయబోతున్నారు. ఓంకార్ వ్యాఖ్యాత.
మలయాళంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ‘తాళ్లుమల’ని 11న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దీని తెలుగు రీమేక్ వెర్షన్ లో సిద్దు జొన్నలగడ్డ నటిస్తాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సబ్ టైటిల్స్ తో అయినా సరే చూడాలని మన ఆడియన్స్ సైతం ఎదురు చూస్తున్నారు. హాట్ స్టార్ లో హాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘థోర్ లవ్ అండ్ థండర్’ని 8నే ఇస్తున్నారు. భారీ అంచనాలతో గత నెల వచ్చిన అర్జున్ కపూర్ జాన్ అబ్రహంల ‘ఏక్ విలన్ రిటర్న్స్’ కూడా అదే డేట్ కి నెట్ ఫ్లిక్స్ లో వస్తోంది. ఇదే ప్లాట్ ఫార్మ్ లో ‘ఇండియన్ ప్రిడేటర్ ది డైరీ అఫ్ ఏ సీరియల్ కిల్లర్’ అందుబాటులోకి వస్తుంది. డాక్యుమెంటరీ మోడల్ అయినప్పటికీ టేకింగ్ బాగుంటుంది.
ఇవి కాకుండా కోబ్రా కాయ్ సీజన్ 5, చెఫ్ టేబుల్ పిజ్జా ఎన్ట్రాప్ట్ లతో పాటు సురేష్ గోపి ‘పాప్పన్’ జీ5లో రానుంది. ఇవన్నీ ఆయా భాషల్లో మంచి సక్సెస్ సాధించినవే. కొన్నింటికి తెలుగు ఆడియో ఇవ్వబోతున్నారు. యాప్స్ ఎక్కువైపోవడంతో రాను రాను జనాలు ఏది సబ్ స్క్రైబ్ చేసుకోవాలో, ఏది వదులుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు. ఇండియాకు వచ్చేటప్పటికీ హాట్ స్టార్, ప్రైమ్ లు పోటాపోటీగా ఉండగా నెట్ ఫ్లిక్స్ మాత్రం మార్కెట్ మీద గ్రిప్ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ రేట్ పెట్టి ఆహా లాంటి లోకల్ యాప్స్ నెట్టుకొస్తున్నాయి కానీ వీటికి ఆన్ లైన్లో టొరెంట్లు, టెలిగ్రామ్ లంటూ రకరకాల రూపాల్లో పైరసీ బెడద తప్పడం లేదు