Shyam Singha Roy : నాని సినిమా సౌండ్ లేదు కానీ ప్లానింగ్ ఉంది

ఈ నెల 24న థియేటర్లలో విడుదల కాబోతున్న నాని శ్యామ్ సింగ రాయ్ ఇంకా ప్రమోషన్ వేగం పెంచలేదు. మీడియాలో ఆర్ఆర్ఆర్ గురించి విపరీతమైన ప్రచారం జరుగుతుండటంతో దాని ట్రైలర్ హడావిడి తగ్గాక తమది మొదలుపెట్టాలని ఎదురు చూస్తోంది నాని టీమ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున చేయబోతున్నారు. జెమినీ ఛానల్ శాటిలైట్ హక్కులను 10 కోట్లకు కొన్నదనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇది కాకుండా డబ్బింగ్ హక్కుల రూపంలో మరో పది కోట్లు అందాయట. అంటే సగానికి పైగా పెట్టుబడి ఈ రూపంలో వచ్చేసింది. థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ఇంకా రాలేదు ఇది కూడా ముప్పై కోట్లకు పైగానే ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్.

గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ లు ఓటిటిలోనే రావడంతో శ్యామ్ సింగ రాయ్ మీద నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందులోనూ మొదటి పాన్ ఇండియా కావడం వల్ల కరెక్ట్ గా క్లిక్ అయితే కనక మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే 83 రూపంలో బాలీవుడ్ నుంచి గట్టి పోటీనే సవాల్ విసురుతోంది. వరుణ్ తేజ్ గని వాయిదా పడటం నానికి ప్లస్ అవుతుంది. ఒకవేళ 17న వచ్చే పుష్పకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అప్పుడు ఇబ్బంది లేకపోలేదు. వారం గ్యాప్ ఉన్నా సరే సినిమా బాగుందనే మాట వస్తే పుష్ప ప్రభావం కనీసం రెండు వారాలకు పైగా ఉంటుంది. ఇప్పుడు అఖండ విషయంలో జరుగుతున్నది చూస్తున్నాంగా.

అఖండ విజయం భారీ సినిమాలకు కొండంత నమ్మకాన్ని ఇచ్చింది. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్యామిలీస్ కూడా వస్తాయని వసూళ్లు నిరూపిస్తున్నాయి. కంటెంట్ కనెక్ట్ అయితేనే సుమా. శ్యామ్ సింగ రాయ్ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా కనిపిస్తున్నప్పటికీ ఇందులో బోలెడు కమర్షియల్ అంశాలు ఉన్నాయట. రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో సాయి పల్లవి, కృతి శెట్టి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవలే కాలం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పాటలు రాసిన చివరి చిత్రం కూడా ఇదే. పెట్టుబడి పరంగా సేఫ్ గేమ్ ఆడిన శ్యామ్ సింగ రాయ్ బిగ్ స్క్రీన్ పై ఏం చేస్తాడో చూడాలి

Also Read : Spider Man : హాట్ కేకుల్లా హాలీవుడ్ సినిమా టికెట్లు

Show comments