Shyam Singha Roy : మంచి ఓపెనింగ్ సాధించిన న్యాచురల్ స్టార్

నిన్న విడుదలైన శ్యామ్ సింగ రాయ్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. సోషల్ మీడియాలో టాక్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ అధిక శాతం పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. కెరీర్ లోనే మొదటిసారి నాని ఇంత పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సాయిపల్లవి పాత్ర సెకండ్ హాఫ్ కే పరిమితమైనా చివరికి హీరో తర్వాత గుర్తుండిపోయేది తనే అన్నంతగా మరోసారి మెప్పించింది. కమర్షియల్ గా దీని సక్సెస్ రేంజ్ ఏంటో ఇప్పుడే చెప్పలేం. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు చాలా అనూహ్యంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో నిన్న రాత్రి నుంచే ఆంక్షలు, నైట్ కర్ఫ్యూతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి తెచ్చారు.

వీటి ప్రభావం ఇతర రాష్ట్రాల మీద పడే అవకాశం లేకపోలేదు. ఓమీక్రాన్ మెల్లగా పాకుతున్న దశలలో జనం అప్రమత్తమవుతున్నారు. సినిమాల కోసం థియేటర్లు వెళ్లాలా వద్దా అనే ఆలోచనలు మళ్ళీ పెరిగినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి శ్యామ్ సింగ రాయ్ ఓపెనింగ్ మాత్రం గట్టిగా వచ్చిందనే చెప్పాలి. ఏపిలో వసతుల లేమి, నిబంధనల ఉల్లంఘన తదితర కారణాలతో కొన్ని థియేటర్లు మూతబడటం కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది. అయినా కూడా శ్యామ్ సింగ రాయ్ కు మంచి ఫిగర్స్ నమోదవుతున్నాయి. ఈ రోజు రేపు వీకెండ్ చాలా కీలకంగా నిలవనుంది. అడ్వాన్ బుకింగ్ ట్రెండ్ ఎంకరేజింగ్ గా ఉండటం సానుకూలంగా కనిపిస్తున్న అంశం.

ఇక ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు శ్యామ్ సింగ రాయ్ మొదటి రోజు సుమారు 6 కోట్ల 70 లక్షల దాకా షేర్ తెచ్చినట్టు తెలిసింది. నైజామ్ నుంచి 2 కోట్లు, సీడెడ్ 60 లక్షలు, ఉత్తరాంధ్ర 48 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 34 లక్షలు, గుంటూరు 24 లక్షలు, కృష్ణా 16 లక్షలు, నెల్లూరు 12 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా 1 కోటి 27 లక్షలు, ఓవర్సీస్ 1 కోటి 33 లక్షలు దాకా వచ్చినట్టు రిపోర్ట్. ఇవి అఫీషియల్ ఫిగర్స్ కాదు కానీ ఇన్ సైడ్ న్యూస్ అయితే గట్టిగానే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 23 కోట్లకు దగ్గరలో ఉంది. ఇప్పుడీ టాక్ ని ఇలాగే హోల్డ్ చేసుకుని కనీసం పది రోజుల పాటు మైంటైన్ చేయడం శ్యామ్ సింగ రాయ్ కు చాలా అవసరం

Also Read : Atrangi Re Report : అత్ రంగీరే రిపోర్ట్

Show comments