iDreamPost
android-app
ios-app

15 ఏళ్ల తర్వాత తారక్, జక్కన్నలతో

  • Published Jun 08, 2020 | 5:45 AM Updated Updated Jun 08, 2020 | 5:45 AM
15 ఏళ్ల తర్వాత తారక్, జక్కన్నలతో

రాజమౌళి తెరకెక్కిస్తున్న టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ కు అదనంగా మరిన్ని స్టార్ అట్రాక్షన్స్ తోడవుతున్నాయి. తాజాగా శ్రియ శరన్ కూడా ఇందులో జాయిన్ అయ్యింది. ఇప్పటిదాకా గుట్టుగా ఉన్న ఈ సీక్రెట్ ను తనే బయటపెట్టింది. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవగన్ సరసన కనిపించబోతున్నట్టు వెల్లడించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కాంబినేషన్ సీన్లు ఉంటాయా లేదా అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. శ్రియ గతంలో రాజమౌళి డైరెక్షన్ లో ఛత్రపతిలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. అది బ్లాక్ బస్టర్. ఆ తర్వాత మళ్ళీ జక్కన్నతో చేసే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రూపంలో బంపర్ ఆఫర్ దక్కిందనే చెప్పాలి.

అజయ్ దేవగన్ సరసన అయినప్పటికీ చాలా కీలక పాత్రే అయ్యుంటుంది. బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అజయ్ దేవగన్ రోల్ ని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్టు ఇప్పటికే టాక్ ఉంది. కాబట్టి శ్రియ తనకు జోడి అంటే ప్రాధాన్యత ఉండే ఉంటుంది. కాకపోతే అసలు హీరోలకు జట్టు కాదు అంతే. గతంలో జూనియర్ సరసన శ్రియ 2005లో నా అల్లుడులో నటించింది. ఇది వచ్చి 15 ఏళ్ళు అయ్యింది.అప్పుడు దాని ఫలితం డిజాస్టర్. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా కాంబో కావడం విశేషమే. ఇక ఛత్రపతి వచ్చి కూడా అంతే కాలం కావడం గమనార్హం. అదే సంవత్సరంలోనే రిలీజై రికార్డులు కొట్టేసింది. ఇలా రాజమౌళి, తారక్ లతో సినిమాలు చేసిన పదిహేను ఏళ్ల తర్వాత శ్రియ కాంబో కావడం విశేషమే. ఇంకా 25 శాతం దాకా ఆర్ఆర్ఆర్ షూటింగ్ బాలన్స్ ఉంది.

వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ అవకాశాలు దాదాపు లేనట్టే. అధికారికంగా ప్రకటించలేదు కానీ సమ్మర్ పోస్ట్ పోన్ ఖాయమని ఇన్ సైడ్ టాక్. అజయ్ దేవగన్ పార్ట్ ఆల్రెడీ పూర్తయ్యింది కాబట్టి శ్రియది కూడా కంప్లీట్ అయ్యే ఉంటుంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ కు సంబంధించి మేజర్ అప్ డేట్ ఈ రూపంలోనైనా వచ్చింది. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్న ఆర్ఆర్ఆర్ కు కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. షూటింగ్ తిరిగి మొదలుపెట్టగానే రామ్ చరణ్, అలియా భట్ ల ఎపిసోడ్లు ముందు పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత బాలన్స్ పార్ట్ ఫినిష్ చేస్తారు. చేతిలో కేవలం ఆరు నెలలే ఉన్నాయి కాబట్టి అభిమానులు 2021 సమ్మర్ రిలీజ్ కు ఫిక్స్ అయిపోతే బెటరేమో