iDreamPost
android-app
ios-app

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ED షాక్

  • Published Oct 07, 2023 | 12:15 PM Updated Updated Nov 03, 2023 | 12:01 PM
  • Published Oct 07, 2023 | 12:15 PMUpdated Nov 03, 2023 | 12:01 PM
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ED షాక్

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో నవదీప్ నిందితుడిగా ఉన్న సంగతి విదితమే. ఇటీవల మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పోలీసులు రాంచందర్ అనే వ్యక్తితో పాటు పలువుర్ని అరెస్టు చేశారు. వీరి దగ్గరి నుండి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిని విచారిస్తున్న సమయంలో రాంచందర్.. నవదీప్‌తో డ్రగ్స్ డీలింగ్స్ జరిగాయని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. నవదీప్ మాదక ద్రవ్యాలు వినియోగించారంటూ ఈ కేసులో ఆయన పేరును ఏ 29గా పేర్కొన్నారు. అనంతరం నార్కోటిక్ బ్యూరో పోలీసులు నవదీప్ ఇంట్లో సోదాలు చేపట్టడంతో పాటు ఆయన్ను కొన్ని గంటల పాటు విచారించారు. ఇప్పుడు ఆయనకు మరో బిగ్ షాక్ తగిలింది.

తాజాగా ఈ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. నార్కోటిక్ అధికారులు నమోదు చేసిన ఆధారంగా ఈడీ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. రెండు సార్లు గైర్హాజరు అయ్యాడని, ఈడీ మూడో సారి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా, నార్కోటిక్ అధికారులు గతంలో చేపట్టిన విచారణలో నవదీప్ కొన్ని విషయాలను వెల్లడించాడని తెలుస్తోంది. గతంలో రామచందర్‌తో కలిసి తాను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు నవదీప్ అంగీకరించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో నవదీప్ విచారణ ఎదుర్కోవడం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet