iDreamPost

చంద్రబాబు మనసులోనైనా జగన్ కి కృతజ్ఞత చెప్పుకోవాలా?

చంద్రబాబు మనసులోనైనా జగన్ కి కృతజ్ఞత చెప్పుకోవాలా?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల 8న అరెస్టైన బాబు.. నేటి వరకు కూడా జైల్లోనే ఉన్నారు. ఇక చంద్రబాబు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు ములాఖత్  ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తున్నారు. ఇటీవలే నారా భువనేశ్వరి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు జైల్లో అందిస్తున్న సదుపాయలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సరైన బెడ్, వేడీ నీళ్లు, ఇతర సదుపాయలు అందించడం లేదంటూ ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మనస్సులోనైనా జగన్ కి కృతజ్ఞతలు తెలిపాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణం.. గతంలో వైఎస్ జగన్ విషయంలో జరిగిన సంఘటనలు  ప్రస్తుతం వైరల్ కావడమే.

2009 సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఆయనను కక్షగట్టి, అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక్కడ జగన్ ను జైల్లో పెట్టింది కాంగ్రెసే అయినప్పటికీ.. అందుకు కారణం మాత్రం టీడీపీనే. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత ఎర్రన్నాయుడి చేత చంద్రబాబు కేసు వేయించి.. జగన్ జైలుకు వెళ్లడానికి కారణమయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాక జగన్ కి జైల్లో ప్రత్యేక సదుపాయాలు లేకుండా చేసేందుకు టీడీపీ అనేక ప్రయత్నాలు చేసింది. అక్రమ కేసులో జైలుకు వెళ్లిన జగన్ కి తొలుత ప్రత్యేక సదుపాయలు ప్రభుత్వం కల్పించింది.

ఇదే సమయంలో టీడీపీ ఎర్రన్నాయుడి తో మరో పిటిషన్ వేయించింది. అవినీతి కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి.. ప్రత్యేక సదుపాయాలు ఎందుకు అంటూ ఎర్రన్నాయుడు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కూడా చంద్రబాబు నాయుడు వేయించారని పలువురు అభిప్రాయం వ్యక్త చేస్తున్నారు. ఈ పిటిషన్ కారణంగా  ఆ సమయంలో ఎంపీగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక సదుపాయలను  తొలగించారు. ఆనాడు టీడీపీ జగన్ పై  కక్ష కట్టి, వెంటాడి.. దాదాపు మూడు, నాలుగు నెలలు మాములుగానే, ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా చేసింది. ఆ తరువాత జగన్ తరపు లాయర్లు  కోర్టును ఆశ్రయించడంతో.. ప్రత్యేక సదుపాయాలను అందించారు. కర్మఫలితం వెంటాడుతుందని, చంద్రబాబు విషయంలో అదే జరిగిందనే వార్తలు వినిపిస్తోన్నాయి. ఆయన ఎందరినో మానసిక క్షోభకు గురి చేశారని, అందుకు ఫలితమే నేడు అనుభవిస్తున్నారనే పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

అందుకే అలాంటి అవినీతి కేసులోనే తాజాగా చంద్రబాబు జైలుకు వెళ్లాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం చాలా ఉన్నతంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు స్కీల్ స్కాం కేసులో గానీ, విచారణలో గానీ, జైల్లో అందిస్తున్న సదుపాయల విషయంలో ఎక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. అంతేకాక చంద్రబాబు వయస్సు రీత్యా ఆయనకు ఎన్నో సదుపాయాలు కల్పించారు. నిజంగా జగన్ అనుకుంటే.. చంద్రబాబుకు ఈ సదుపాయలు లేకుండా చేయోచ్చని, కానీ అలాంటి నైజం ఆయనది కాదని కొందరు అంటున్నారు.

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయల విషయంలో వెలెత్తి చూపడానికి ఆస్కారం లేదు. ఆయనకు కోరుకున్న సదుపాయాలను జైలు అధికారులు అందిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కలిసి జగన్ పెట్టిన ఇబ్బందులకు, ఈనాడు చంద్రబాబుకు రాజమండ్రి జైలులో అందిస్తున్న సదుపాయలను గమనించాలి. అసలు ప్రస్తుతం చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అందిస్తున్న సదుపాయాలకు ఆయన మనసులోనైన జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పాలనే పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మరి..  ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి