iDreamPost
android-app
ios-app

Oke Oka Jeevitham హమ్మయ్యా – శర్వా హిట్టు కొట్టాడు

  • Published Sep 10, 2022 | 12:04 PM Updated Updated Dec 08, 2023 | 1:26 PM

పోయిన మార్కెట్ ని రికవర్ చేసుకోవడం పెద్ద సవాలవుతుంది. అలాంటిది ఏకంగా ఆరు ఫ్లాపులు ఏకబిగిన పలకరిస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. శర్వానంద్ దీన్ని ఫేస్ చేశాడు.

పోయిన మార్కెట్ ని రికవర్ చేసుకోవడం పెద్ద సవాలవుతుంది. అలాంటిది ఏకంగా ఆరు ఫ్లాపులు ఏకబిగిన పలకరిస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. శర్వానంద్ దీన్ని ఫేస్ చేశాడు.

  • Published Sep 10, 2022 | 12:04 PMUpdated Dec 08, 2023 | 1:26 PM
Oke Oka Jeevitham హమ్మయ్యా – శర్వా హిట్టు కొట్టాడు

మాములుగా ఒక హీరోకు ఒకటో రెండో డిజాస్టర్స్ వస్తేనే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. పోయిన మార్కెట్ ని రికవర్ చేసుకోవడం పెద్ద సవాలవుతుంది. అలాంటిది ఏకంగా ఆరు ఫ్లాపులు ఏకబిగిన పలకరిస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. శర్వానంద్ దీన్ని ఫేస్ చేశాడు. మొదట పడి పడి లేచే మనసు దారుణంగా బోల్తా కొట్టింది. ఇటీవలే సీతారామం లాంటి ఆల్ టైం క్లాసిక్ ఇచ్చిన హను రాఘవపూడి బ్యాడ్ డైరెక్షన్స్ లో ఒకటిగా అది నిలిచిపోయింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ట్రై చేద్దామని చూసిన రణరంగం వారం తిరక్కుండానే వెనక్కు వచ్చింది. తమిళంలో బ్లాక్ బస్టర్ కొట్టిన 96ని జానుగా రీమేక్ చేస్తే కనీసం యూత్ ని మెప్పించలేకపోయింది.
Sharva hits
సరే ఇవన్నీ కాదు మహేష్ బాబులాగా మెసేజ్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ ఇద్దామని శ్రీకారంతో వస్తే తిరస్కారం తప్పలేదు. ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మహాసముద్రం అనే ఇంటెన్స్ సబ్జెక్టుతో శర్వాని ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ నో అన్నారు. పోనీ ఫ్యామిలీస్ ని లక్ష్యంగా చేసుకుని ఆడవాళ్ళూ మీకు జోహార్లు అంటే విపరీతమైన క్లాసులు భరించలేక బాక్సాఫీస్ రిజల్ట్ తేడా కొట్టేసింది. అందుకే ఒకే ఒక జీవితం ప్రకటించినప్పుడు,రిలీజ్ ఫిక్స్ అయినప్పుడు కానీ ఎలాంటి బజ్ లేదు. కానీ ప్రీమియర్లతో మొదలుపెట్టి నిన్న మార్నింగ్ షో దాకా వచ్చిన యునానిమస్ పాజిటివ్ టాక్ శర్వానంద్ కు పెద్ద రిలీఫ్ కలిగిస్తోంది. హమ్మయ్య హిట్ కొట్టాడనే సంతోషాన్ని కలిగించింది.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని తీసుకుని దానికి మదర్ సెంటిమెంట్ ని జోడించిన దర్శకుడు శ్రీకార్తీక్ ఈ సినిమాను మలిచిన తీరుకు యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి మద్దతు దక్కుతోంది. తక్కువ అంచనా వేస్తే స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారని చూసిన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకపోయినా ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ కావడంతో నిన్న సాయంత్రం నుంచే బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఉదయం డల్లుగా కనిపించిన థియేటర్లకు జనం వస్తున్నారు. బ్రహ్మాస్త్ర నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా రెండూ పోల్చుకుంటే ఒకే ఒక జీవితమే బెటర్ ఛాయస్ అనిపించేలా ఉండటంతో ఇంకా వేగంగా పికప్ కానుంది

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş