iDreamPost
iDreamPost
స్టార్ హీరోలకు గ్యాప్ రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా అభిమానులు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు. అందుకే ఏదో ఒక సినిమా చేస్తూ వాళ్ళను సంతృప్తి పరచడమే లక్ష్యంగా కథలు ఎంచుకోవడం ఒకోసారి కెరీర్ నే ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు కింగ్ షారుఖ్ ఖాన్ అలాంటి పరిస్థితినే ఎదురుకుంటున్నాడు. 2018 డిసెంబర్ లో రిలీజైన జీరో తర్వాత షారుఖ్ కొత్త సినిమా 2019లో ఏది విడుదల కాలేదు. అసలు షూటింగ్ కూడా మొదలుపెట్టుకోలేదు. కేవలం నిర్మాతగా బదలా తీసి హిట్ కొట్టాడు కానీ హీరోగా మాత్రం మౌనాన్ని ఆశ్రయించాడు.
ఇప్పటిదాకా కొత్త సినిమా ఊసు ఏదీ లేదు. ఏదో వ్యోమగామి బయోపిక్ అనుకున్నారు కానీ అది కూడా డ్రాప్ అయ్యాడు. అసలు ఎవరితో చేయబోతున్నాడో కూడా ఎవరికి తెలియదు. నిజానికి షారుఖ్ ఇంతగా డిఫెన్స్ లో పడడానికి కారణం ఉంది. గత ఐదేళ్లు షారుఖ్ చేసినవన్నీ డిజాస్టర్లు అయ్యాయి. జీరో కన్నా ముందు జబ్ హ్యారీ మీట్స్ సీగల్, రయీస్, డియర్ జిందగీ, ఫ్యాన్, దిల్వాలే అన్ని మాములు డిజాస్టర్లు కాదు. 2014లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ బాగానే ఆడింది కానీ అది కూడా షారుఖ్ రేంజ్ బొమ్మ కాదు.
ఈ నేపథ్యంలో ఇన్నేసి ఫ్లాపులు వస్తే ఎంత పెద్ద హీరోకైనా తట్టుకోవడం కష్టం. అందులోనూ తన సమకాలీకులు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లకు ఈ పరిస్థితి లేదు. అందుకే కొంచెం లేట్ అయినా కరెక్ట్ సబ్జెక్టుతో రావాలనే ప్లాన్ లో ఉన్నాడు షారుఖ్. గతంలో 1995లో మెగాస్టార్ చిరంజీవి సైతం ఇలాంటి స్థితిలోనే ఏ సినిమా చేయకుండా కెరీర్ లో మొదటిసారి 1996 మొత్తం ఒక్క విడుదల లేకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత హిట్లర్ తో ఇచ్చిన కం బ్యాక్ మళ్ళీ రేస్ లో నిలబెట్టింది. షారుఖ్ కూడా అలాంటి బ్రేక్ నే ఆశిస్తున్నాడు కాబోలు. తమిళ్ లో గత ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ తరహాలో మంచి రా సబెక్టు కోసం ఎదురు చూస్తున్నాడట. అది ఎప్పుడు నెరవేరుతుందో.