iDreamPost
android-app
ios-app

వార్ 2 లో హృతిక్ ఎన్టీఆర్‌తో పాటు మరో బాలీవుడ్ హీరో..!

  • Published Oct 25, 2024 | 1:10 PM Updated Updated Oct 25, 2024 | 1:10 PM

War 2 Movie Update: టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు తిరుగులేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ వాళ్లకు కూడా ఆల్రెడీ తారక్ ఏంటి అనేది తెలుసు. కానీ స్ట్రెయిట్ సినిమాతో ఇప్పుడు దానిని మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నాడు . అయితే ఇప్పుడు వార్ 2 మూవీ లో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. దానికి సంబంధించిన న్యూస్ ఏంటో చూసేద్దాం.

War 2 Movie Update: టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు తిరుగులేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ వాళ్లకు కూడా ఆల్రెడీ తారక్ ఏంటి అనేది తెలుసు. కానీ స్ట్రెయిట్ సినిమాతో ఇప్పుడు దానిని మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నాడు . అయితే ఇప్పుడు వార్ 2 మూవీ లో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. దానికి సంబంధించిన న్యూస్ ఏంటో చూసేద్దాం.

  • Published Oct 25, 2024 | 1:10 PMUpdated Oct 25, 2024 | 1:10 PM
వార్ 2 లో హృతిక్ ఎన్టీఆర్‌తో పాటు మరో బాలీవుడ్ హీరో..!

జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అనేది టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అటు బాలీవుడ్ లో కూడా దాదాపు తారక్ గురించి ఓ అంచనాకు వచ్చారు. ఇక ఒక్కసారి బాలీవుడ్ లో స్ట్రైట్ బొమ్మ పడితే.. పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ వార్2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తారక్ పాన్ ఇండియా మూవీస్ చేశాడు. అయితే బాలీవుడ్ లో దానిని అందరూ చూస్తారనే గ్యారెంటీ లేదు. సో ఇప్పుడు స్ట్రెయిట్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం హృతిక్ తో వార్ 2 షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. అక్కడ యాక్షన్ , ఛేంజింగ్ సీన్స్ తో పాటు.. హృతిక్ తో కలిసి ఒక పాటలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాడు.

పైగా ఎన్టీఆర్ టాలెంట్ చూసి ఇప్పటికే.. వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ షాక్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ లో , డైలాగ్స్ చెప్పడంలో తారక్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడట. కేవలం తనకు ఏం కావాలి అనేది మాత్రమే చెప్తున్నారట. ఇక వీరిద్దరి మధ్య షూట్ జనవరి వరకు కొనసాగుతుంది. వార్ మూవీ మొదటి పార్ట్ అంత హిట్ కాకపోయినా కూడా వార్ 2 ను స్టార్ట్ చేశారు మేకర్స్. దింతో ఇప్పుడు వార్ 2 ను మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ది నెగిటివ్ రోల్ అయినా కూడా .. తారక్ రేంజ్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వార్ 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇది మల్టీస్టారర్ గానే బాగా బజ్ తెచ్చుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ మూవీలో మరొక ఇంట్రెస్టింగ్ క్యామియో కూడా ఉండబోతుందంట. ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడంట. దాదాపు 15 నిమిషాల పాటు షారుక్ రోల్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే దానికి సంబంధించిన షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ తో ఓ ఛేజింగ్ సీన్ లో షారుక్ ఉంటాడని.. ఎన్టీఆర్- షారుక్ మధ్య ఫేస్ టు ఫేస్ యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేశారట దర్శకుడు. దీనితో ఇప్పుడు తారక్ అభిమానులు మరోసారి కాలర్ ఎగరేయడానికి రెడీ అవుతున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే మాత్రం.. ఇక బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కు తిరుగు ఉండదు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే తెలుగులో ఈ సినిమాను యుద్ధ భూమి అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దాదాపు ఈ ఏడాది ఆఖరిలోపు సినిమా నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను వదిలే అవకాశం ఉంది. ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/