iDreamPost
iDreamPost
ఎన్ని చట్టాలు వచ్చినా, శిక్షలు వచ్చినా, శిక్షిస్తున్నా కొంతమంది ఆకతాయిలు మాత్రం మహిళలు, యువతుల పట్ల అనుచిత ప్రవర్తన మారట్లేదు. కొంతమంది ఆకతాయిలు అమ్మాయిల్ని వేధిస్తూనే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఓ ఆకతాయి ఓ యువతిని వేధించాడు, ఆ అమ్మాయి పోలీసులకి దీనిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడం గమనార్హం,
ఓ యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కగా ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అడ్రస్ అడిగాడు. ఆమె అడ్రస్ చెప్పి తన స్టేషన్ రాగానే దిగి మరో ట్రైన్ కోసం వేచి చూస్తుండగా ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి అడ్రస్ సరిగ్గా అర్ధం కాలేదు చెప్పమని అడిగాడు. అయితే ఈ సారి ఆ వ్యక్తి యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన శరీరానికి అతను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఇది గమనించిన యువతి అతనిపై సీరియస్ అయి అక్కడే ఉన్న మెట్రో పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయితే అతడు పట్టించుకోకుండా అక్కడ ఉన్న స్టేషన్‌లో ఫిర్యాదు చేయమన్నాడు.
దీంతో ఆ యువతి ఆశ్చర్యపోయి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోగా, దీనిని పెద్ద సీన్ చేయొద్దని ఆమెకు నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. దీంతో ఆ బాధితురాలు తనకి జరిగిన ఈ అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్‌కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయి ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్టు తెలిపింది.
In the context of the recent incident reported at Jorbagh, we have already taken up the issue with the concerned security agencies. Delhi Police has already taken cognizance of the complaint and are investigating into the matter.
— Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 3, 2022