iDreamPost
android-app
ios-app

రౌడీ హీరోతో సెన్సిబుల్ డైరెక్టర్స్

  • Published May 04, 2020 | 6:21 AM Updated Updated May 04, 2020 | 6:21 AM
రౌడీ హీరోతో సెన్సిబుల్ డైరెక్టర్స్

అర్జున్ రెడ్డి నుంచి రౌడీ హీరోగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటివి తీవ్రంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఆశలన్నీ పూరి జగన్నాధ్ సినిమా మీదే పెట్టుకున్నాడు. దీనికి ఫైటర్/లైగర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. దీని తర్వాత శివ నిర్వాణతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. నిన్ను కోరి, మజిలి లాంటి ఎమోషనల్ లవ్ స్టొరీస్ ని తెరకెక్కించిన శివ ఇప్పుడు అగ్రెసివ్ హీరోయిజంతో కనిపించే విజయ్ దేవరకొండను ఎలా చూపిస్తడనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.

నాని తో చేస్తున్న టక్ జగదీశ్ పూర్తి కాగానే శివ నిర్వాణ దీన్ని మొదలుపెట్టేస్తారు. మరోవైపు ఇంకో సెన్సిబుల్ డైరెక్టర్ ని విజయ్ దేవరకొండ ఎంచుకున్నట్టు తెలిసింది. దిల్ రాజు బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నట్టు విజయ్ చెప్పాడు కాని అది ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. తాజా అప్ డేట్ ప్రకారం ఆ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణట. అధికారికంగా బయటికి రాలేదు కాని లీకవుతున్న సమాచారం గట్టిగానే ప్రచారంలో ఉంది. ఈయన ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో నాని వి పూర్తి చేశారు.

ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ దేవరకొండ ఆలోచనా దృక్పధంలో చాలా మార్పు వచ్చినట్టే. నిజానికి వరల్డ్ ఫేమస్ లవర్ చేసిన క్రాంతి మాధవ్ కూడా సెన్సిబులిటీస్ ఉన్నవాడే. కాని విజయ్ దేవరకొండ ఇమేజ్ కు తగ్గట్టు కథను రాసుకోవడంతో అతనిలో ఒరిజినాలిటికి బదులు ఇంకోరకమైన అవుట్ పుట్ ఇచ్చేశాడు. అందులో హీరో ప్రమేయం ఉందనే టాక్ కూడా వినిపించింది కాని దానికి సంబంధించి ఎవరూ స్పందించలేదు. పూరి జగన్నాధ్ ను మినహాయిస్తే తాజాగా విజయ్ దేవరకొండ ఎంచుకున్న ఇతర దర్శకులు ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో పేరు తెచ్చుకున్న వాళ్ళు కావడం గమనార్హం. శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహనకృష్ణ తర్వాత విజయ్ దేవరకొండ లిస్ట్ లో నెక్స్ట్ ఇంకెవరెవరున్నారో

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş