iDreamPost
android-app
ios-app

కృష్ణం రాజు విగ్రహాన్నిచూసి ప్రభాస్ ఒక్కసారిగా ఉలికి పడ్డాడు.. శ్యామలా దేవి

  • Published Oct 10, 2023 | 1:45 PM Updated Updated Nov 03, 2023 | 12:00 PM
  • Published Oct 10, 2023 | 1:45 PMUpdated Nov 03, 2023 | 12:00 PM
కృష్ణం రాజు విగ్రహాన్నిచూసి ప్రభాస్ ఒక్కసారిగా ఉలికి పడ్డాడు.. శ్యామలా దేవి

తెలుగు తొలి తరం హీరోల్లో రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణం రాజు. ఆయన నట వారసుడిగా వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కృష్ణంరాజుకు కుమార్తెలే ఉండటంతో.. తన వారసుడని ప్రభాస్ గురించి గొప్పగా చెప్పుకునేవారు. పెద్దనాన్న అన్నా, ఆయన కుటుంబమన్నా అంతే ప్రేమగా ఉండేవారు ప్రభాస్. పలు సార్లు ఆడియో ఫంక్షనల్లో కూడా కనిపించి మెప్పించారు సీనియర్, జూనియర్ రెబల్ స్టార్స్. అయితే గత ఏడాది అభిమానుల్ని, కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు కృష్ణంరాజు. ఆయన కడసారి వీడ్కోలు పలికేందుకు సినీ లోకం మొత్తం కదిలి వెళ్లింది. అభిమానులు సైతం చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఆ సమయంలో కూడా అభిమానుల కోసం విందు ఏర్పాటు చేసి.. దు:ఖంలో కూడా అభిమానుల గురించి ఆలోచించిందీ ఈ కుటుంబం.

ఆ తర్వాత స్వగ్రామం మొగల్తూరులో స్మారక సభను ఏర్పాటు చేసి.. భారీ ఎత్తున విందు భోజనాలు ఏర్పాటు చేశారు. స్వయంగా ప్రభాస్ అభిమానుల ముందుకు వచ్చి.. అందరూ తిని వెళ్లండని చెప్పారు. అంతటి బాధలోనూ.. లక్ష మందికి కడుపునిండా భోజనం పెట్టడం విశేషం. కృష్ణంరాజు- ప్రభాస్ కుటుంబం అనగానే.. అతిధి మర్యాదలతో చంపేస్తారన్న పేరు ఉంది.. దానికి తగ్గట్లే వంట, వార్పులు కూడా ఉంటాయి. పెద్ద నాన్న బాటలోనే నడుస్తూ.. అతిధి మర్యాదలు చేస్తుంటారు ప్రభాస్. కాగా, ఇటీవల కృష్ణం రాజు చనిపోయి ఏడాది గడిచిపోయింది. హైదరాబాద్‌లో సంవత్సరీకం చేయగా.. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృష్ణం రాజు విగ్రహం గురించి ఓ ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు.

పిఠాపురానికి చెందిన అభిమాన్ని ఈ విగ్రహాన్ని అందించారని, దీంతో ఆయన లేరన్న బాధ లేదని, తను మా పక్కనే ఉన్నారని ఆనందంగా గడుపుతున్నానని అన్నారు. ఈ విగ్రహం ప్రభాస్ చూసి ఒక్కసారిగా ఉలికి పడ్డాడని చెప్పారు. ‘ఈ విగ్రహాన్ని చూసి ప్రభాస్ ఒక్కసారిగా ఉలికి పడి వెనక్కు వెళ్లిపోయారు. ఒక నిమిషం మాట్లాడలేదు. పెద్దనాన్నే ఉన్నారు అని అనుకున్నాడు. సర్ ప్రైజ్‌గా వచ్చారు. ఈ విగ్రహాన్ని చూసి ఉలికి పడి.. తనివి తీరా చూసి.. ఎవరు చేశారు దీన్ని అడిగి మెచ్చుకున్నారు’ అని చెప్పారు. అంత జీవ కళ ఉట్టిపడినట్లు ఉందని అన్నారట. కాగా, పెద్ద నాన్న మరణం తర్వాత కాస్త కుంగుబాటుకు లోనైన ప్రభాస్.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు. సలార్, కల్కి, స్పిరిట్, డీలక్స్ రాజా (పరిశీలనలో ఉంది) వంటి  చిత్రాలు చేస్తున్నారు. వీటిలో సలార్ ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom