iDreamPost
android-app
ios-app

వీడియో వైరల్: రీల్స్ పిచ్చితో స్కూల్‌ విద్యార్థుల డేంజరస్ స్టంట్స్

  • Published Jun 25, 2024 | 1:29 PMUpdated Jun 25, 2024 | 1:29 PM

తాజాగా ఓ ఇద్దరు స్కూల్ విద్యార్థినులు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం ఓ డేంజరెస్ స్టంట్ ను చేశారు. కానీ, ఆ స్టంట్ చివరిలో ఒక ప్రాణాంతకమైన సంఘటన ఉంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో దీనిన చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఓ ఇద్దరు స్కూల్ విద్యార్థినులు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం ఓ డేంజరెస్ స్టంట్ ను చేశారు. కానీ, ఆ స్టంట్ చివరిలో ఒక ప్రాణాంతకమైన సంఘటన ఉంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో దీనిన చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Published Jun 25, 2024 | 1:29 PMUpdated Jun 25, 2024 | 1:29 PM
వీడియో వైరల్: రీల్స్ పిచ్చితో స్కూల్‌ విద్యార్థుల డేంజరస్ స్టంట్స్

ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు రీల్స్ పిచ్చితో కొందరు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటే.. మరోవైపు రీల్స్ మోజులో పడి కొందరు ప్రాణాలు పొగొట్టుకునే ఘటనలు జరుగుతున్నాయి. అయిన సరే ఈ సోషల్ మీడియా యూజర్స్ కు ఏమాత్రం బెదురు, భయం లేకుండా పోయింది.ఈ క్రమంలోనే రీల్స్ పిచ్చిలో మునిగిపోయిన ప్రతిఒక్కరూ పేమస్ అవ్వడం కోసం చేస్తున్న విన్యసాలు అన్ని ఇన్నీ కాదు.ముఖ్యంగా ఈ రీల్స్ మోజులో పడి చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ ప్రపంచాన్నే మార్చిపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ తమ టాలెంట్ ను ప్రదర్శించి ఫేమస్ అవ్వడం కోసం ఏకంగా డేంజరస్ స్టంట్ లను చేస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇలా ఎక్కడ చూసిన ఒంటి మీద సోయా లేకుండా రీల్స్ తో రెచ్చిపోతున్నారు. అయితే ఇప్పటి వరకు యూత్, మహిళలే అనుకుంటే.. ఇప్పుడు ఈ లిస్ట్ లో తాజాగా స్కూల్ పిల్లలు కూడా చేరారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇద్దరూ స్కూల్ విద్యార్థినులు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం చేసిన విన్యాసం చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా ఓ ఇద్దరు స్కూల్ విద్యార్థినులు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం ఓ డేంజరెస్ స్టంట్ ను చేశారు. కానీ, ఆ స్టంట్ చివరిలో ఒక ప్రాణాంతకమైన సంఘటన ఉంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో దీనిన చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఆ వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు బాలికలు హైవే రోడ్డు పై మధ్యలో నిలబడి ఉన్నారు. ఇక  వారి వెనుకాలే ఒక తెల్లటి కారు కూడా ఆగివుంది. పైగా ఆ కారు దగ్గర మరో ఇద్దరు పాఠశాల విద్యార్థులు చూస్తూ నిలబడి ఉన్నారు. అలాగే ఆ వీడియోలో హైవేపై కార్లు అతి వేగంతో వెళ్తున్నాయి. ఇక అంతలోనే ఆ స్కూల్ విద్యార్థినులు రోడ్డు మధ్యలోనిలబడి ఎవరూ ఊహించని విన్యాసాలు చేయడం ప్రారంభించారు.

ఈ క్రమంలోనే ముందుగా ఓ అమ్మాయి మరో అమ్మాయి చేతులు పట్టుకుని తొడలపై కాళ్లు పెట్టి భుజాల పైకి ఎక్కుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వేగంగా గాల్లోకి ఎగురుతూ పల్టీ కొట్టి కిందపడే క్రమంలో.. తిరిగి తన సపోర్ట్ అయిన అమ్మాయి చేతులు పట్టుకుని నిటారుగా నిలబడాలసి ఉంది. కానీ, అంతలోనే సదరు బాలిక తన పాదాల మీద బ్యాలెన్స్ తప్పి అమాంతంగా రోడ్డు మీద పడిపోయింది. పైగా రోడ్డుపై పడటంతో దెబ్బ గట్టిగా తగిలినట్టు ఆ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఎందుకంటే.. ఆ బాలిక సొంతంగా తాను లేచి నిలబడలేకపోతుంది. అలాగే పక్కనే ఉన్న తన స్నేహితురాలు తనను పైకి లేపి ఓదార్చుతోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్కూల్ పిల్లల ఫీట్ వీడియోను చూసి నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. పైగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ వీడియో ఫిబ్రవరి 17న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయబడింది. ఇక వీడియోకు ఇప్పటివరకు 17 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా రీల్స్ పేరుతో హైవే రోడ్డుపై డేంజర్ స్టంట్స్ చేస్తున్నారంటూ విమర్శలతో దుమ్మేత్తి పోస్తున్నారు. పైగా ఇలాంటి స్టంట్స్ చేసినప్పుడు నడుము విరిగిపోతుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. మరి, స్కూల్ పిల్లలు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shalu Kirar (@shalugymnast)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి