iDreamPost
android-app
ios-app

Sarkaru Vaari Paata : “సర్కారు వారి పాట” షూటింగ్ కి బ్రేక్? కారణం అదేనట.

  • Published Dec 03, 2021 | 8:38 AM Updated Updated Dec 03, 2021 | 8:38 AM
Sarkaru Vaari Paata : “సర్కారు వారి పాట” షూటింగ్ కి బ్రేక్? కారణం అదేనట.

దర్శకుడు పరశురామ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్పెయిన్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. ఈ మధ్యే హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ కూడా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఫైట్‌ సీక్వెన్స్‌ & ఒక పాటను చిత్రీకరించనున్నారు.

ఫిలిం నగర్ టాక్ ప్రకారం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కి కాస్త బ్రేక్ పడిందని సమాచారం. మహేష్ బాబు గత కొంతకాలంగా తీవ్రమైన మోకాలి సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. సర్జరీ కోసం మహేష్ బాబు షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుని రెస్ట్ తీసుకోబోతున్నాడు. దాంతో షూటింగ్ నెల నుండి రెండు నెలల పాటు వాయిదా పడుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

‘సర్కారు వారి పాట’ జనవరి 13, 2022న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈసారి, SS రాజమౌళి ‘RRR,’ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మరియు ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వంటి మూడు భారీ సినిమాలు సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని విడుదదలకు రెడీ అవుతున్నాయి. ఇక ‘సర్కారు వారి పాట’ వేసవి కానుకగా ఏప్రిల్ 1, 2022న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

Also Read : Pushpa : టార్గెట్ ని బన్నీ ఈజీగానే చేరుకోవచ్చు కానీ …

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet