విమానాశ్రయంలో సంస్కృత ఎనౌన్స్ మెంట్లు – ఎక్కడంటే?

  • Updated - 08:30 AM, Tue - 21 June 22
విమానాశ్రయంలో సంస్కృత ఎనౌన్స్ మెంట్లు  – ఎక్కడంటే?

దేశంలోకి కోవిడ్ వచ్చాక చాలా విషయాల్లో మార్పు వచ్చింది. కొన్ని అంశాల్లో భారతీయులు తిరిగి తమ మూలాల వైపు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో వారాణసి విమానాశ్రయ అధికారులు కొత్త ఆలోచన చేశారు.

ఇప్పటివరకు విమానాశ్రయాల్లో ఇంగ్లీషు, హిందీ ఎనౌన్స్ మెంట్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు వీటితో పాటు సంస్కృతంలోనూ కోవిడ్ అనౌన్స్ మెంట్లు చేయాలని నిర్ణయించారు. పురాతన కాలం నుంచి వారాణసి ప్రాంతం సంస్కృతానికి కేంద్రంగా ఉంది. అందుకు గౌరవ సూచికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ కు రాగానే వారాణసిలో ఉన్న అనుభూతిని పొందుతారని అంటున్నారు.

దీనిపై చాలామంది సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ తరహా ఎనౌన్స్ మెంట్లను వారాణసి రైల్వేస్టేషన్లోనూ ప్రారంభించాలని కోరుతున్నారు. ఎక్కువగా యాత్రికులు, భక్తుల తాకిడితో వారణాసి విమానాశ్రయం ఉత్తరప్రదేశ్ లోనే రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు దేశంలోనే సంస్కృతంలో ఎనౌన్స్ మెంట్లు ప్రారంభించిన మొదటి విమానాశ్రయంగా కూడా ఘనత సాధించింది.

Show comments