Dharani
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో మరోసారి భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ మీదకు చెప్పు విసిరాడో యువకుడు. ఆ వివరాలు..
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో మరోసారి భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ మీదకు చెప్పు విసిరాడో యువకుడు. ఆ వివరాలు..
Dharani
చిన్నా చితక నాయకుడి పర్యటన అంటేనే ఓ రేంజ్‌లో భద్రత ఏర్పాటు చేస్తారు. అదే ఇక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పర్యటన అంటే వారం రోజుల ముందు నుంచే వారు పర్యటించే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు. భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించి పటిష్టమైన సెక్యురిటీని ఏర్పాటు చేస్తారు. ఇక రోడ్ షో వంటి కార్యక్రమాలు అయితే.. భద్రతా సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉంటారు. అన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే.. వారి కాన్వాయ్ ముందుకు కదలడానికి అనుమతి ఇస్తారు. అయితే ఎంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినా సరే.. కొన్ని సందర్భాల్లో అనుచిత ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. మోదీ కారుపైకి ఓ యువకుడు చెప్పు విసరడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వివరాలు..
మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి ఉత్తరప్రదేశ్, వారణాసిలో పర్యటించారు. ఈ క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ నుంచి కేవీ మందిర్‌కు మోదీ కాన్వాయ్ రోడ్ షోగా వెళ్తున్న సమయంలో.. ఓ యువకుడు మోదీ బుల్లెట్ ప్రూఫ్ కారు మీదికి చెప్పు విసిరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 1.41 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో 19 సెకన్ల తర్వాత.. రోడ్ షో కోసం వచ్చిన జనాల్లో ఉన్న ఓ వ్యక్తి.. చెప్పు విసిరినట్లు కనిపిస్తోంది. అది కాస్తా వచ్చి ప్రధాని ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు బానెట్‌పై పడినట్లు వీడియోలో ఉంది.
ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే స్పందించి.. దాన్ని చేత్తో తీసి పక్కకు విసిరేయడం కనిపిస్తోంది. అయితే మోదీ కారు మీద పడింది చెప్పా లేక ఏదైనా వస్తువు అనేది తెలియాల్సిందే. అయితే కొందరు అది చెప్పు కాదని.. మొబైల్ అని చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఓ ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్.. అది చెప్పు కాదని.. సెల్‌ఫోన్ అని పేర్కొన్నారు. అయితే అది ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదని తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పంజాబ్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో వైఫల్యం ఎదురైంది. కొన్ని నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్‌పై మోదీ కాన్వాయ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
Security breach ! A video of Slipper thrown at PM Modi’s bulletproof car in Varanasi has surfaced. Reportedly A Congress worker has been arrested for throwing the slipper on PM’s car.pic.twitter.com/pvkXuRobnj
— Baba Banaras™ (@RealBababanaras) June 19, 2024