iDreamPost
android-app
ios-app

వీడియో: యువకుడి లైంగిక వేధింపులు.. నడిరోడ్డుపై బుద్ది చెప్పిన యువతులు!

  • Published Sep 01, 2024 | 8:05 PM Updated Updated Sep 01, 2024 | 8:05 PM

Uttar Pradesh, Varanasi: ఈ మధ్య కాలంలో మహిళలపై ప్రతి నిత్యం లైంగిక వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు టీజిగ్ చేయడం, అత్యాచారాలకు తెగబడుతున్నారు కామాంధులు. తాజాగా జరిగిన దారుణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Uttar Pradesh, Varanasi: ఈ మధ్య కాలంలో మహిళలపై ప్రతి నిత్యం లైంగిక వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు టీజిగ్ చేయడం, అత్యాచారాలకు తెగబడుతున్నారు కామాంధులు. తాజాగా జరిగిన దారుణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వీడియో: యువకుడి లైంగిక వేధింపులు.. నడిరోడ్డుపై బుద్ది చెప్పిన యువతులు!

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారలు, లైంగిక వేధింపులకు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ద మహిళలు అని చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. వీరలో ఏమాత్రం మార్పు రావడం లేదని పోలీసులు అంటున్నారు. ఈవ్ టీజింగ్ చేస్తున్న ఓ యువకుడికి ఇద్దరు యువతులు బుద్ది చెప్పారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం.

ఉత్తర్ ప్రదేశ్‌లో యువతులను లైగింకంగా వేధించిన యువకుడి భరతం పట్టిన యువతులకు సంబంధించి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కారులో ఇద్దరు యువతులు వెళ్తున్నారు.. బుల్లెట్ రైడర్ వారిని వెంబడిస్తూ వెకిలి చేష్టలు చేయడం మొదలు పెట్టారు. చాలా సేపు ఓపికతో ఉన్న ఆ యువతులు అతడికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతే కారు దిగి.. బుల్లెట్ రైడర్ ని ఆపి దేహశుద్ది చేశారు.

వారణాసిలోని హుకుల్ గంజ్ లోని లాల్ పూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి బుల్లెట్ మోటర్ పై వెళ్తున్న వ్యక్తి.. కారులో వెళ్తున్న అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేశాడు. అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ.. గొడవకు దిగాడు. దీంతో ఆ యువతులు కారు దిగి అతన్ని ఆపి దాడి చేశారు. దీంతో అక్కడ నుంచి పారిపోయాడు.. తర్వాత బుల్లెట్ ని కింద పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు యువతులు. లాల్ పూర్ ప్రాంతంలోని సిద్దేశ్వరి మాత ఆలయం సమీపంలో ఈ ఘటనను బాటసారులు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీస్ అధికారులు అంటున్నారు. మరోవైపు అలాంటి నిందితులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.