nagidream
RBI Cancelled 7 Banks Licences: ఆర్బీఐ బ్యాంక్ వరుసగా బ్యాంకులకు షాక్ ఇస్తుంది. వరుసపెట్టి ఆయా బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేస్తుంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేసిన ఆర్బీఐ తాజాగా మరో బ్యాంకుకి షాక్ ఇచ్చింది.
RBI Cancelled 7 Banks Licences: ఆర్బీఐ బ్యాంక్ వరుసగా బ్యాంకులకు షాక్ ఇస్తుంది. వరుసపెట్టి ఆయా బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేస్తుంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేసిన ఆర్బీఐ తాజాగా మరో బ్యాంకుకి షాక్ ఇచ్చింది.
nagidream
బ్యాంకులపై ఆర్బీఐ నిఘా ఎప్పుడూ ఉంటుంది. బ్యాంకుల తీరుని ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖాతాదారులకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకునే బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపిస్తుంటుంది. నిబంధనలను అతిక్రమిస్తే కొన్నిసార్లు భారీగా జరిమానా విదిస్తుంది. ఆ నిబంధనల ఉల్లంఘన మరీ ఎక్కువగా ఉంటే కనుక కొన్ని సందర్భాల్లో బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేస్తుంటుంది. ఇటీవల కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పలు బ్యాంకుల లైసెన్స్ ని ఆర్బీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బ్యాంకుకి ఆర్బీఐ షాకిచ్చింది. బ్యాంకు లైసెన్స్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత నెలలో కూడా పలు బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి కేంద్రంగా పని చేస్తున్న బనారస్ మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంకు దివాళా తీసింది. ఈ క్రమంలో సదరు బ్యాంకు లైసెన్స్ ని రద్దు చేసింది ఆర్బీఐ. ఈ బ్యాంకుకి ఏ మార్గంలోనూ ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోవడం, ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బ తినడం వల్లే ఈ బ్యాంకు విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. జూలై 4 నుంచే బనారస్ మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం అమలులో ఉందని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఖాతాదారుల విషయానికొస్తే.. 99.98 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్ చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వనున్నారు.
డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా డిపాజిటర్ల డబ్బును పూర్తిగా ఇవ్వనున్నారు. ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో డిపాజిటర్ కి 5 లక్షల రూపాయల వరకూ ఇన్సూరెన్స్ కవరేజీ అనేది ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల బ్యాంకులు నష్టపోవడం, బ్యాంకులు దివాళా తీయడం వంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తారు.
ఈ బ్యాంకే కాదు.. జూన్ నెలలో రెండు బ్యాంకుల లైసెన్స్ ని రద్దు చేసింది ఆర్బీఐ. యూపీలోని ఘాజీపూర్ కి చెందిన పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన సిటీ కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది. జనవరి 2024లో రాజస్థాన్ లోని సుమేర్పూర్ మర్చంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మహారాష్ట్రలోని జయప్రకాశ్ నారాయణ్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, గుజరాత్ లోని దభోయ్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్, కర్ణాటకలోని హిరియూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది.