iDreamPost
iDreamPost
మన్సాస్ ట్రస్ట్ విషయంలో అశోక్ గజపతి రాజు చేసిన ఆరోపణలకు సంచయిత గజపతిరాజు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు, అశోక్ గజపతి రాజు ఇద్దరు కలిసి మాన్సాస్ ట్రస్ట్ ని ఆర్ధికంగా దెబ్బతీసేలా వ్యవహరించారని తీవ్రంగా దుయ్యబట్టారు. నిన్నటిరోజున అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌ని భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న విలువైన ఆస్తులను కాజేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారని కుమార్తె అదితి గజపతిరాజుతో కలిసి విజయనగరంలోని ఆయన బంగ్లాలో విలేకర్లతో మాట్లాడారు.
అయితే అశోక్ గజపతిరాజు చేసిన ఈ ఆరోపణలకు సంచయిత గజపతిరాజు స్పందిస్తూ , ఆనందగజపతి రాజు పెద్ద బిడ్డగా, ఆయన వారసురాలిగా, మాన్సాస్ భాద్యతలు చేపట్టాను అన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని. మా తండ్రి చితి ఆరక ముందే మీరు మా బాబాయి అశోక్ గజపతి రాజు గారికి అనుకూలంగా జీఒ జారీచేశారని , ఆయన పదవీ కాలంలో చేపట్టిన చర్యలు కారణంగా మాన్సాస్ పూర్తిగా ఆర్ధికంగా నష్టపోయిందని, విద్యాసంస్థల్లో నాణ్యత పూర్తిగా పడిపోయిందని, ట్రస్టుకు చెందిన భూములు అన్యాక్రాంతం అవుతుంటే ఆ కేసులని వాదించడానికి కనీసం లాయర్లను నియమించలేదని విశాఖ జిల్లా జడ్జీ తీర్పే దీనికి ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
అలాగే మాన్సాస్ లా కాలేజీ క్యాంపస్ ను ఐఎలెఫెస్ కు ఉచితంగా ఇచ్చేశారని, విద్యార్దులను షెడ్డుల్లోకి మార్చారని చివరికి ఆ సంస్థ ఎంత పెద్ద కుంభకోణం లో ఇరుక్కుందో దేశం మొత్తం చూసిందని చెప్పుకొచ్చారు . చంద్రబాబు తన సహచరుడైన మా బాబాయి ని పొగిడే ముందు మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఏ విదంగా ద్వంసం చేశారో తెలుసుకోవాలని, నిజానికి ఇవన్నీ మీకు తెలిసినా ఇవన్నీ మీరు ఇరువురు కలిసి చేసిన పనులుగానే ఇక్కడి ప్రజలందరు బావిస్తున్నారని ఘాటుగా స్పందించారు.