iDreamPost
android-app
ios-app

Samantha Song In Pushpa : పుష్ప ఐటెం సాంగ్ అదరగొడుతోంది

  • Published Dec 12, 2021 | 6:32 AM Updated Updated Dec 12, 2021 | 6:32 AM
Samantha Song In Pushpa : పుష్ప ఐటెం సాంగ్ అదరగొడుతోంది

ఇటీవలే విడుదలైన పుష్ప పార్ట్ 1లోని కీలకమైన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహూ అంటావా ఆన్ లైన్ లో రికార్డులు సృష్టిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత అది కూడా చైతుతో విడాకులు తీసుకున్నాక కెరీర్ లో మొట్టమొదటి సారి సమంతా చేసిన పాట కావడంతో అంచనాలు మాములుగా లేవు. గతంలో సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన రింగ రింగా, ఆ అంటే అమలాపురం రేంజ్ లో లేకపోయినా స్లో పాయిజన్ లాగా ఇది కూడా మెల్లగా ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దాటేసింది. రిలీజ్ లోపు అదయ్యాక ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. ఏ రేంజ్ అనేది ఇంకొంత కాలం వేచి చూడాలి

వీడియో వదలకపోయినా సామ్ స్టిల్స్ చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమవుతోంది. తను ఇక ఏ కట్టుబాట్లు పెట్టుకోదలుచుకోలేదు. అందాల ఆరబోతకు సైతం సిగ్నల్ ఇచ్చినట్టుగా క్లారిటీ వచ్చేసింది. సో ఇకపై గ్లామర్ రోల్స్ అయినా, ఫ్యామిలీ మ్యాన్ 2 లాంటి వెబ్ సిరీస్ లలో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అయినా ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని తేటతెల్లం చేసింది. అందుకే పుష్ప కోసం కోటి రూపాయలకు పైగానే తీసుకున్నట్టు ఫిలిం నగర్ టాక్ నడిచింది. ఇది నిజమో కాదో క్లారిటీ లేదు కానీ మొత్తానికి పెద్ద ఫిగరే ఇచ్చిన మాట వాస్తవం. పుష్ప విడుదలకు ఇంకో అయిదు రోజులు మాత్రమే ఉండటంతో త్వరలో ఈ పాట తాలూకు వీడియో బిట్ ని వదులుతారు

సాధారణంగా స్టార్ హీరోయిన్లు వైవాహిక జీవితంలో ఇలా విడాకులు తీసుకున్నాక అవకాశాలు అంత సులభంగా రావు. గత చరిత్ర చూస్తే అర్థమవుతుంది. కానీ దానికి భిన్నంగా సామ్ కు మాత్రం ఆఫర్లు ఆగడం లేదు. ఆల్రెడీ ఒక హాలీవుడ్ మూవీకి సైన్ చేసింది. విజయ్ సేతుపతి నయనతార కాంబోలో చేసిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని ప్రతిపాదనలు ఒకే అయ్యే స్టేజిలో ఉన్నాయి. రాజ్ అండ్ డికె ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారు. సో సమంతా ఇకపై తన ఫోకస్ దేని మీద ఉండబోతోందో స్పష్టంగా చెప్పేసినట్టే. విడాకుల విషయం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు తడబడకుండా నేరుగానే సమాధానం ఇచ్చేస్తోంది

Also Read : Radhe Shyam : 30 రోజుల గడువుతో పాన్ ఇండియా రన్

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis