iDreamPost
android-app
ios-app

తప్పదు.. అందరూ విరుష్కలనే ఫాలో అవ్వాల్సిందే..!!

తప్పదు.. అందరూ విరుష్కలనే ఫాలో అవ్వాల్సిందే..!!

అభిమానులు విరుష్క అని ముద్దుగా పిలుచుకునే భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలివుడ్‌ నటి అనుష్క శర్మ దంపతులకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. విరాట్‌కు హెయిర్‌ కటింగ్‌ అనుష్క చేయడం, అనుష్కకు విరాట్‌ చేయడం ఆ వీడియలో ఉంది. అది చూసిన అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్, అందాల తారల దాంపత్య జీవితాన్ని చూసి మురిసిపోయారు. లాక్‌డౌన్‌ కార ణంగా ఇంట్లో ఉండి ఏమీ తోచక విరుష్క దంపతులు అలా చేశారని చెప్పవచ్చు.

కరోనా వైరస్‌ కారణంగా భారత్‌దేశం లాక్‌డౌన్‌ అయింది. గత నెల 22వ తేదీన జరిగిన జనతా కర్ఫ్యూ నుంచి ఈ లాక్‌డౌన్‌ అమలవుతోంది. అంటే ఇప్పటికి 11 రోజులు కావస్తోంది. మరో 13 రోజులపాటు ఈ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు దేశ ప్రధాని కూడా చెప్పలేరు.

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిత్యవసరాలు, కూరగాయలు, పండ్లు, మందుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రజలకు ఓ చిక్కువచ్చి పడింది. అదే జుట్టు సమస్య. హెయిర్‌ కటింగ్‌ చేయించుకుందామన్నా సెలూన్‌ షాపులు లేవు. లాక్‌ డౌన్‌ నిబంధనలతో హెయిర్‌ కటింగ్‌ దుకాణాలు మూతపడ్డాయి. జట్టు పెరిగుతూ అందరూ కల్‌నాయక్‌ల్లా మారిపోతున్నారు.

దుకాణాలు మూసేసినా.. బోర్డులపై ఉన్న వారి నంబర్లకు ఫోన్‌ చేసి ఇంటికి రావాలని కొందరు కోరుతున్నారు. అయితే హెయిర్‌ కటింగ్‌ చార్చి నాలుగు రెట్లు ఎక్కువ చెబుతున్నారు. కొంతమంది వారు అడిగినంత ఇస్తుండగా.. మరికొత మంది ఎలాగోలా ఈ రెండు వారాలు సర్దుకపోదామనుకుని మిన్నుకుండిపోతున్నారు. పెరిగిన జట్టుతో రకరకాల హెయిర్‌ సై్టల్స్‌ చేస్తూ ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారు. పలువురు సతీమణులు తమ శ్రీవారి జుట్టుతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫ్యాషన్‌ డిజైనర్ల అవతారం ఎత్తుతున్నారు. అర్ధాంగిలు చేస్తున్న ప్రయోగాలతో ఎక్కడ జుట్టు ఊడిపోతుందోనన్న భయం భర్తల్లో నెలకొంది. ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తి వేస్తారా.. సెలూన్ కు వెళదామా అనే తొందరలో ఉన్నారు.