iDreamPost
android-app
ios-app

అభిమాని ఫోన్ లాక్కున్న సల్మాన్ ఖాన్

అభిమాని ఫోన్ లాక్కున్న సల్మాన్ ఖాన్

సెలెబ్రిటీలు బయటకు వస్తే చాలు వారికి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అభిమానులు తమ అభిమాన నటుడిని చూడటానికి,సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడతారు. అలా ఇబ్బంది పెట్టే అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించే సెలెబ్రెటీలకు కూడా కొదువ లేదు.. గతంలో బాలకృష్ణ తన అభిమానులపై చేయి చేసుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది..

అయితే తాజాగా సల్మాన్ ఖాన్ సెల్ఫీ తీసుకోవడానికి అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. గోవాలోని పనాజీ విమానాశ్రయంలో తనతో సెల్ఫీలు దిగాలని అత్యుత్సాహం చూపించిన అభిమాని ఫోన్ లాక్కుని మరోసారి వార్తల్లో నిలిచాడు సల్మాన్ ఖాన్.. ఎయిర్పోర్ట్ ఉద్యోగి అయిన ఒక యువకుడు సల్మాన్ ఖాన్ ని చూసి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగానే అతని ఫోన్ ని మరుక్షణంలో లాక్కుని ఆ యువకుడికి షాక్ ఇచ్చాడు సల్లూభాయ్..

ఈ సంఘటనపై ఎలాంటి పిర్యాదు నమోదు కాలేదని సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఫోన్ లాక్కున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.

కాగా సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. గతంలో సల్మాన్ ఖాన్ పై బాడ్ బాయ్ ఇమేజ్ ఉండేది.. కృష్ణ జింకలు వేటాడిన కేసు,రాష్ డ్రైవింగ్ తో ఫుట్ పాత్ పై పడుకున్న వారిపై కారు నడిపాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాష్ డ్రైవింగ్ కేసుని కొట్టివేయగా కృష్ణ జింకను వేటాడిన కేసు పెండింగులో ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom