iDreamPost
android-app
ios-app

భిన్న కోణాల్లో సాయిపల్లవి డబుల్ ట్రీట్

  • Published May 09, 2020 | 5:59 AM Updated Updated May 09, 2020 | 5:59 AM
  • Published May 09, 2020 | 5:59 AMUpdated May 09, 2020 | 5:59 AM
భిన్న కోణాల్లో సాయిపల్లవి డబుల్ ట్రీట్

తెలంగాణా పోరి భానుమతిగా ఫిదాలో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న కేరళ భామ సాయి పల్లవి నాని ఎంసిఎ, శర్వానంద్ పడిపడి లేచే మనసు తర్వాత తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. ఇప్పుడు ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలతో లాక్ డౌన్ అయ్యాక పలకరించబోతోంది. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా వాటి తాలుకు ఎక్స్ క్లూజివ్ పోస్టర్లు సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ చేస్తున్నాయి. అందులో మొదటగా వచ్చింది విరాట పర్వం. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చివరి దశలో ఉంది.

ఒకవేళ కరోనా తాకిడి లేకపోతే ఈ పాటికి రిలీజ్ డేట్ వచ్చేసేది. 90వ దశకంలో ఉదృతంగా ఉన్న నక్సలైట్ నేపధ్యాన్ని తీసుకుని వేణు ఊడుగుల దీన్ని రూపొందిస్తున్నట్టు గతంలో టాక్ వచ్చింది. దానికి బలం చేకూరేలా అమర వీరుల స్మారక చిహ్నం ముందు సాయి పల్లవి చాలా సహజమైన వేషధారణలో ఉన్న పిక్ రిలీజ్ చేసింది టీం. రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రెండోది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టొరీ. నాగ చైతన్యతో మొదటిసారి జట్టుకట్టిన సాయి పల్లవి ఇంతకు ముందు వచ్చిన టీజర్. లిరికల్ వీడియోలతోనే ఆకట్టేసుకుంది.

ఇప్పుడు కొత్తగా వర్షంలో తడుస్తూ ఒక రకమైన క్యుట్ ఎక్స్ ప్రెషన్స్ తో చూస్తున్న సాయి పల్లవి దీంతోనే ఫ్యాన్స్ ని మరోసారి లవ్ లో పడేసెలా ఉంది. విరాట పర్వం మాదిరిగానే లవ్ స్టొరీ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది. షూటింగులకు అనుమతి రాగానే బాలన్స్ షూట్ పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళిపోతారు. ట్రేడ్ లోనూ ఇప్పటికే దీని మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇంత గ్యాప్ తర్వాత సాయి పల్లవిని బ్యాక్ టు బ్యాక్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీస్ లో చూడటం కన్నా అభిమానులకు కావాల్సింది ఏముంది. కాకపోతే కొద్దిరోజులు వేచి చూడాలి అంతే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş