iDreamPost
android-app
ios-app

షాకింగ్‌ ఘటన.. రూ. 88 వేల కోట్లు మిస్సింగ్.. అన్ని రూ. 500 నోట్లే.. అసలేం జరిగింది!

  • Published Jun 17, 2023 | 6:40 PM Updated Updated Jun 17, 2023 | 6:40 PM
  • Published Jun 17, 2023 | 6:40 PMUpdated Jun 17, 2023 | 6:40 PM
షాకింగ్‌ ఘటన.. రూ. 88 వేల కోట్లు మిస్సింగ్.. అన్ని రూ. 500 నోట్లే.. అసలేం జరిగింది!

వంద రూపాయలు పోతేనే మనసుకు చాల బాధ కలుగుతుంది. ఎందుకంటే.. ఆ సొమ్ము మన దగ్గరకు రావడానికి ఎంత కష్టపడ్డామో మనకే తెలుస్తుంది. అలాంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు పోయాయి అంటే.. మనది కాకపోయినా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఈ వార్త చదివితే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇక్కడ మాయమైన వేల కోట్ల రూపాయలు ప్రజా ధనం. అర్థం కాలేదా.. అయితే చదవండి. ఆర్‌బీఐకి చేరాల్సిన 88 వేల కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీఐ కమిషన్‌ వెల్లడించింది. అసలు ఆర్బీఐకి చేరాల్సిన ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా మాయం అయ్యాయి అనే విషయం అర్థం కావడం లేదు. అసలేం జరిగింది అంటే..

ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం.. ముద్రించిన 500 రూపాయల నోట్లకు, భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు చేరిన నోట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది అని తెలిసింది. ఇందులో లెక్కలోకి రాని ఈ కరెన్సీ నోట్ల విలువ 88,032.5 కోట్ల రూపాయలు. అంటే ఈ మొత్తం మిస్‌ సుమారు 88,032.5 కోట్ల రూపాయలు. ఇంత భారీ మొత్తం నగదు మిస్‌ కావడం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మూడు భారతీయ మింట్‌లు.. 8,810.65 మిలియన్ రూపాయల విలువైన 500 రూపాయల నోట్లను విడుదల చేశాయి.

కానీ వాటిల్లో కేవలం 7,260 మిలియన్ నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరాయని ఆర్టీఐ ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. మిగిలిన నోట్ల విలువ సుమారు 88,032.5 కోట్ల రూపాయలు. ఈ మొత్తం ఆర్బీఐకి చేరలేదని తెలిపింది. దీనిపై రిజర్వ్‌ బ్యాంకుకు ప్రశ్నలు సంధించినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు.

భారత కరెన్సీ నోట్లను మూడు ప్రభుత్వ ప్రెస్‌ల ద్వారా ముద్రిస్తారు. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, దేవాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లు కరెన్సీ నోట్లను ముద్రిస్తాయి. ఈ మూడు ప్రెస్‌లు ముద్రించిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపుతాయి. దేశంలో ద్రవ్య ప్రవాహాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది.

మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారాన్ని వెబ్‌సైట్ ద్వారా ప్రచురించారు. 500 నోట్ల స్థితిగతులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆయన ప్రశ్నించారు. ఇక 2015-16లో, నాసిక్ ప్రెస్ కొత్తగా రూపొందించిన రూ.500 నోటులో 375.450 మిలియన్ రూపాయల విలువ కలిగిన నోట్లను ముద్రించిందని నివేదిక పేర్కొంది.

కానీ మరో ఆర్టీఐ రిపోర్టులో మాత్రం, నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్ ఏప్రిల్ 2015, డిసెంబర్ 2016 మధ్య RBI రికార్డులో ఉన్న దాని ప్రకారం 345 మిలియన్ రూపాయల విలువ కలిగిన 500 నోట్లను మాత్రమే స్వీకరించినట్లు చూపుతున్నాయి. రఘురామ్‌ రాజన్‌ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో అనగా.. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2015-మార్చి 2016) రూ. 210,000 మిలియన్లు, రూ. 500 నోట్లను రిజర్వ్ బ్యాంక్‌కు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/