iDreamPost
android-app
ios-app

RRR : ప్రేక్షకుల టైంని డిమాండ్ చేస్తున్న రాజమౌళి

  • Published Nov 27, 2021 | 10:24 AM Updated Updated Nov 27, 2021 | 10:24 AM
RRR : ప్రేక్షకుల టైంని డిమాండ్ చేస్తున్న రాజమౌళి

ఇప్పటికే పీక్స్ లో ఉన్న ఆర్ఆర్ఆర్ అంచనాలు ఇంకా ఎగబాకుతున్నాయి. నిన్న విడుదల చేసిన సోల్ యాంతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం సీరియస్ ఎమోషన్స్ ని హై లైట్ చేస్తూ సినిమాలోని పాత్రధారులను చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయనే రీతిలో ఆడియన్స్ ని ముందే సిద్ధం చేస్తున్న జక్కన్న ట్రైలర్ కోసం సరిపడా ఎమోషనల్ గ్రౌండ్ ని చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల కెరీర్ లోనే బెస్ట్ అనిపించే పెర్ఫార్మన్స్ ఇందులోనే చూడొచ్చన్న అభిప్రాయం ఈ వీడియోని పదే పదే చూస్తున్న అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ఆర్ఆర్ఆర్ సెన్సార్ ని కూడా పూర్తి చేసుకుంది. ఊహించని విధంగా ఫైనల్ వెర్షన్ ని 3 గంటల 6 నిమిషాలకు లాక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్జున్ రెడ్డి తర్వాత దాన్ని మించిన లెన్త్ ఉన్న సినిమా ఇదే. ఇంటర్వెల్ పది నిముషాలు కలుపుకుని థియేటర్ లో అడుగు పెట్టాక గడపాల్సిన సమయం మూడున్నర గంటలుగా తేలింది. ఇంటి నుంచి బయలుదేరడం తిరిగి రావడం తదితరులు కలుపుకుంటే ఇంకో అరగంట పెరుగుతుంది. కొత్త జెనరేషన్ దర్శకులు కథలను రెండు గంటలకే చెప్పడానికి నానా తిప్పలు పడుతుంటే రాజమౌళి మాత్రం తన స్కూల్ కే కట్టుబడి ఉండటంతో కంటెంట్ మీద నమ్మకాన్ని చూపిస్తోంది.

జనవరి 7న తెలుగు రాష్ట్రాల్లో మాములు రచ్చ జరిగేలా కనిపించడం లేదు. ఏపీలో టికెట్ రేట్లు, అదనపు షోలు లేకపోవడం లాంటి వ్యవహారాలు ఎలా ఉన్నా ఇక జక్కన్న టీమ్ వెనుకడుగు వేసేలా కనిపించడం లేదు. డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రమోషన్లను ఇంకో స్థాయికి తీసుకెళ్ళబోతున్నారు. త్వరలోనే రాధే శ్యామ్ టీమ్ యాక్టివ్ అయిపోతుంది కాబట్టి ఆలోగా తన సినిమాను నేషన్ వైడ్ హాట్ టాపిక్ గా మార్చేందుకు రాజమౌళి వేస్తున్న స్కెచ్చులన్నీ మంచి ఫలితాలను ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్ కూడా భారీ ఈవెంట్ ద్వారా గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వారం వెల్లడించబోతున్నారు

Also Read : Antim : అంతిమ్ రిపోర్ట్