iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్ కథ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. యుఎస్ లో ఎన్కోర్ పేరుతో స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నారు కానీ దానివల్ల వచ్చే ప్రత్యేకమైన భారీ నెంబర్లంటూ ఏమి ఉండవు. 1118 కోట్ల గ్రాస్ తో 557 కోట్ల షేర్ తో ఆర్ఆర్ఆర్ ప్రస్తుతానికి నాలుగో స్థానంలో నిలిచింది. దంగల్, బాహుబలి 2, కెజిఎఫ్ 2 తర్వాత ప్లేస్ లో సర్దుకోవాల్సి వచ్చింది. కొన్న ప్రతిఒక్కరికి లాభాలు ఇచ్చిన ఆర్ఆర్ఆర్ నెట్ ఫ్లిక్స్, జీ5 ద్వారా ఓటిటి రూపంలో వచ్చాక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన రచయితలు దర్శకులు ఈ విజువల్ గ్రాండియర్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాకపోతే బాహుబలి 2ని దాటేస్తుంది కెజిఎఫ్ 2ని దగ్గరకు రానివ్వదనుకున్న అభిమానుల ఆశలు నెరవేరలేదు. ఇంకా చైనా జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాలేదు. వాళ్లకు ఓటిటిలో చూసే ఛాన్స్ ఉండదు కాబట్టి రెవెన్యూ పరంగా ట్రిపులార్ కు ఇంకా చాన్సు ఉంది. పైన చెప్పిన లెక్క వరల్డ్ వైడ్ కాబట్టి ఆ దేశంలోనూ విడుదలైతే మార్పు ఉంటుంది. మరి దానికి జక్కన్న టీమ్ ప్లాన్ చేశారో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ కెజిఎఫ్ 2 కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో ఆర్ఆర్ఆర్ కు పోటీగా రాకపోయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదన్న మాట వాస్తవం. ఇక ఏరియాలు దేశాల వారిగా చూస్తే ఫైనల్ ఫిగర్స్ ఈ విధంగా ఉన్నాయి
నైజాం – 111 కోట్ల 80 లక్షలు
సీడెడ్ – 46 కోట్లు
ఉత్తరాంధ్ర – 35 కోట్ల 50 లక్షలు
గుంటూరు – 18 కోట్ల 10 లక్షలు
ఈస్ట్ గోదావరి – 15 కోట్ల 80 లక్షలు
వెస్ట్ గోదావరి – 13 కోట్ల 26 లక్షలు
కృష్ణా – 14 కోట్ల 70 లక్షలు
నెల్లూరు – 10 కోట్ల 50 లక్షలు
ఏపి తెలంగాణ ఫైనల్ షేర్ – 265 కోట్ల 65 లక్షలు
కర్ణాటక – 43 కోట్లు
తమిళనాడు – 42 కోట్ల 40 లక్షలు
హిందీ వెర్షన్ – 126 కోట్లు
ఓవర్సీస్ – 95 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ టోటల్ షేర్ – 582 కోట్ల 65 లక్షలు
గ్రాస్ – 1117 కోట్ల 30 లక్షలు
ఇదంతా జిఎస్టితో పాటుగా వచ్చిన నెంబర్లు. నెల తర్వాత నెమ్మదించడం ఆర్ఆర్ఆర్ వసూళ్లను ప్రభావితం చేసింది. టాలీవుడ్ గర్వించదగ్గ స్థాయిలో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో రెండు రాజమౌళివే ఉండటం విశేషం. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మహేష్ బాబుతో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి ఏ స్థాయిలో ఫీవర్ ఉంటుందో ఊహించుకోవడం కష్టం. తను సమర్పకుడిగా వ్యవహరిస్తున్న బ్రహ్మాస్త్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్న జక్కన్న త్వరలోనే మహేష్ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టబోతున్నారు. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో మహేష్ ఎలాగూ బిజీ అవుతాడు కాబట్టి ఆలోగా ఒక వెర్షన్ ని సిద్ధం చేసే ఛాన్స్ ఉంది.