iDreamPost
android-app
ios-app

హిట్ మ్యాన్ కు ఫైన్.. కారణం ఏంటంటే?

హిట్ మ్యాన్ కు ఫైన్.. కారణం ఏంటంటే?

వన్డే వరల్డ్ కప్ 2023 రసవత్తరంగా సాగిపోతోంది. లీగ్ మ్యాచ్ లలో ఊహించని మలుపులతో ఉత్కంఠ రేపే విజయాలను నమోదు చేస్తున్నాయి జట్లు. కాగా ఈ ప్రపంచకప్ లో భారత్ అదరొడుతోంది. టీమిండియా ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ మూడింట్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దీని వెనకాల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కృషి మరువలేనిది. మెరుపు బ్యాటింగ్ తో జట్టును విజయ తీరాలకు చేరుస్తున్నాడు. అయితే తాజాగా హిట్ మ్యాన్ కు జరిమానా విధించారు. అయితే అది మ్యాచ్ కు సంబంధించింది మాత్రం కాదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు. రోహిత్ శర్మకు పూణే పోలీసులు మూడు చలాన్లు వేసినట్లు తెలుస్తోంది.

నాయకత్వ పఠిమతో జట్టు ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ఊహకందని స్ట్రాటజీతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నాడు రోహిత్ శర్మ. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. కాగా రేపు అనగా గురువారం భారత్, బంగ్లాదేశ్ పూణే వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ముంబై నుంచి తన కారులో పూణేకు బయలు దేరినట్లు సమాచారం. అలా వెళ్తున్న క్రమంలో ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ వేపై ఓవర్ స్పీడ్ తో కారును నడిపినట్లు పోలీసులు గుర్తించినట్లు పూణేకు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

ఎక్స్ ప్రెస్ హైవే పై ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ లలో రోహిత్ శర్మ ప్రయాణిస్తున్న కారు పరిమితికి మించిన వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు మూడు చలాన్లు విధించినట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో 84 బంతుల్లో 131 పరుగులు చేసి అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఆ తర్వాత, భారత సారథి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 63 బంతుల్లో 86 పరుగులతో మరో అద్భుత ఇన్నింగ్స్‌ని ఆడాడు రోహిత్ శర్మ. దీంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి