iDreamPost
android-app
ios-app

వీడియో: ATMకు వెళ్లాలంటేనే భయపడేలే ఉన్న దారుణ ఘటన!

వీడియో:  ATMకు వెళ్లాలంటేనే భయపడేలే ఉన్న దారుణ ఘటన!

నేటి సమాజంలో అక్రమ సంపాదన కోసం పాకులాడే వారి సంఖ్య పెరిగిపోయింది. కష్టపడి సంపాదించడం చేతకాక.. పరుల సొమ్మును కొట్టేస్తున్నారు. ఇళ్లు, షాపులు వంటి వాటిల్లో చోరీలు చేసి అందిన కాడికి దొచుకెళ్తున్నారు.  అంతేకాక మరికొందరు అయితే ఇంకా బరితెగించి మనుషులపై దాడి చేసి మరి.. వారి వద్ద ఉన్న సొమ్మును లాకెళ్తున్నారు. ఇక తాజాగా జరిగిన  ఘటన చూస్తే.. ఏటీఎం వెళ్లే వాళ్లు భయందోళనకు గురవుతారు.  ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తిపై ఇద్దరు దుండగులు దాడి చేసి.. అతడి వద్ద  ఉన్న సొమ్ము  దోచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ ప్రాంతంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో  డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. తన వద్ద ఉన్న రూ.7 లక్షలను డిపాజిట్ చేస్తూ ఉండగా.. ఏటీఎం లోపలికి నలుగురు దుండగులు ప్రవేశించారు.  ఏటీఎంలో నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు.. బాధితుడిపై పెప్పర్ స్ప్రే కొట్టి .. డబ్బుల బ్యాగును దొచుకెళ్లారు.  ఇద్దరిలో ఒకరు  హెల్మెంట్ పెట్టుకోగా, మరొకరు ముఖానికి దస్తీ కట్టుకున్నాడు. ఈ ఘటన మొత్తం ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  ఆ వీడియోలో బాధితుడిపై అత్యంత దారుణంగా ఆ దుండగులు దాడి చేశారు.

 ఈ వీడియో చేసిన వారు.. ఏటీఎంకి వెళ్లాలంటేనే భయ పడుతున్నారు.  ఈ ఘటన ఇటీవల జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక  ఈ ఘటనపై బహాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ చేపట్టిన విచారణలో  నిందితులను గుర్తించారు. జూలై 14న  ఆ నలుగురు నిందితులను  అందుపులోకి తీసుకున్నారు.  ఈ దోపిడీకి పాల్పడిన వారు కేరళ రాష్ట్రంకు చెందిన  థాన్సిస్ అలీ, మహమ్మద్ సహద్, తన్సీహ్, అబ్దుల్ ముహీస్ లుగా  పోలీసులు  గుర్తించారు. వారి నుంచి రూ.3.25 లక్షల నగదు, అలానే వాహనం, మోటార్ బైక్, దోపిడీకి ఉపయోగించిన ఇతర సామాగ్రిని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నగర ప్రజలు బాబోయ్ అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఎక్కువ డబ్బును ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు, డ్రా చేసేందుకు వెళ్లేవారు తోడుగా నమ్మకమైన వ్యక్తులను తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో ఏటీఎం వద్దకు వెళ్లాల్సి వస్తే  తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.