iDreamPost
android-app
ios-app

వ్యాక్సిన్ వేయించుకోండి.. బిర్యానీ ఫ్రీగా తినండి..

వ్యాక్సిన్ వేయించుకోండి.. బిర్యానీ ఫ్రీగా తినండి..

కొద్ది రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారం ముక్కు పుడకలు అందించారు స్వర్ణకారులు. ఆ తర్వాత టీకా వేయించుకోండి బీరు ఫ్రీగా తీసుకోండి అంటూ మరో సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఏపీలో ను కూడా తాజాగా హోటల్ సంస్థ నిర్వాహకుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి బిర్యానీ ఫ్రీగా తినండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాకుండా విజయనగరం, కాకినాడలో ఉన్న తన హోటల్స్ వద్ద ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే అందులో కొన్ని కండిషన్ కూడా పెట్టడం గమనార్హం.

ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు నమోదువుతున్నాయి. ఇక ఏపీని వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే 24 గంటల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు వేల మార్కును దాటింది. 10 రోజుల క్రితం వరకు వందల్లోనే నమోదైన కేసులు.. ఇప్పుడు వేల సంఖ్యలో నమోదవ్వడం ఏపీని కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలు తప్పవా అనే భయం వెంటాడుతోంది. ప్రస్తుతం ప్రజల్లో సైతం నిర్లక్ష్యం పెరిగింది. ఇలాంటి సమయంలో కరోనాను కట్టడి చేయాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడమే ప్రధాన ఆయుధం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం సైతం టీకా ఉత్సవంలో పాల్గొంటోంది.

ఓవైపు ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. సరిపడ స్టాక్ లేకున్నా కేంద్రంతో వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు పోరాడుతున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం వ్యాక్సిన్ పై అపోహలు తొలగడం లేదు. ఏపీలో అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఊహించిన స్థాయిలో ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు పలు సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి.

Also Read : కోవిడ్ వ్యాక్సిన్ కొరతకు ఎగుమతులే ప్రధాన కారణమా..?

కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఆఫర్ల గురించి వింటూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యానీ ఫ్రీగా ఇస్తాం అంటూ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.

అయితే ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే. టీకా ఉత్సవంలో భాగంగా నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు.. అంటే ఈ నాలుగు రోజుల పాటు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు ఉచితంగా బిర్యానీ అందిస్తారు. హలో కిచెన్ అనే సంస్థ ఈ ఫ్రీ బిర్యానీ అఫర్ పెట్టింది. ఆ సంస్థకు చెందిన విజయనగరం, కాకినాడ బ్రాంచీలో ఈ ఉచిత బిర్యానీ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే ఆ హోటల్ దగ్గర కూడా ప్రచార బోర్డులు పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అవుతోంది.

సాధరణంగా ఏ సంస్థ ఆఫర్లు పెట్టినా కొన్ని షరుతులు పెడతాయి. అలాగే ఈ ఆఫర్ కు కూడా కూడా కొన్ని షరతులు ఉన్నాయి మరిచిపోకండి. ఫ్రీ బిర్యానీ కావాలి అనుకున్న వారు మొదట వ్యాక్సిన్ తీసుకున్నట్టు రశీదు చూపించాలి. అయితే అలే కేవలం ఆ రసీదు చూపిస్తే సరిపోదు.. మీరు వేగంగా కూడా ఉండాలి. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తొలి వంద మందికి మాత్రమే ఆ రోజు బిర్యానీ అందిస్తారు. కండిషన్లు ఎలా ఉన్న ఆఫర్ మాత్రం అదుర్స్ అంటున్నారు బిర్యానీ ప్రియులు.. దీంతో హోటల్ కు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. మరికెందుకు ఆలస్యం మీరు విజయనగరం, కాకినాడల్లో ఉంటే త్వరపండి.. వ్యాక్సిన్ తీసుకొండి.. ఫ్రీ బిర్యాని పొందండి

Also Read : కరోనా వ్యాక్సిన్ వేసుకొనిరండి.. ఉచితంగా బీరు తాగండి..