iDreamPost
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావులో ఓ కీలక పాత్ర పోషించేందుకు తను ఓకే చెప్పినట్టు సమాచారం.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావులో ఓ కీలక పాత్ర పోషించేందుకు తను ఓకే చెప్పినట్టు సమాచారం.
iDreamPost
పవన్ కళ్యాణ్ బద్రితో హీరోయిన్ గా పరిచయమై, జానీ అనే ఒకే ఒక సినిమా అయ్యాక అతనితోనే జీవితాన్ని పంచుకుని కొంతకాలం తర్వాత విడాకులు తీసుకుని ఒంటరి జీవితం గడుపుతున్న రేణు దేశాయ్ తిరిగి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావులో ఓ కీలక పాత్ర పోషించేందుకు తను ఓకే చెప్పినట్టు సమాచారం. క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు ఇంకా బయటికి రాలేదు కానీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ రోజు నుంచే తనుండే షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేసిన ఈ యాక్షన్ ఎంటర టైనర్ బడ్జెట్ ఎక్కువే
ఇది 70 దశకంలో స్టువర్ట్ పురంలో ప్రాంతంలో పేరుమోసిన దొంగ కథ. చోరీ వృత్తి అయినప్పటికీ ఎన్నో గొప్ప పనులు చేసిన వ్యక్తిగా ఇతని గురించి కథలు అక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందన్న మాట . దీనికోసమే హైదరాబాద్ లో ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ వేసి ట్రైన్ ఎపిసోడ్లను షూట్ చేయబోతున్నారు. మాములుగా అవుట్ డోర్ లో నిజమైన రైళ్లపై తీసే ఇలాంటి సన్నివేశాలు ఇందులో ఎక్కువగా ఉండటంతో స్పెషల్ గా సెట్ వేసుకున్నారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న టైగర్ నాగేశ్వరరావులో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు.
రేణు దేశాయ్ పవన్ తో చేసిన రెండు సినిమాలు కాకుండా ఆవిడ నటించిన మూవీ తమిళంలో జేమ్స్ పండు ఒకటే. ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెబుతూ వ్యక్తిగత జీవితానికి అంకితమయ్యారు. పవన్ తో విడిపోయాక కొంత కాలం మౌనంగా ఉన్నప్పటికి రియాలిటీ షోలకు జడ్జ్ గా అప్పుడప్పుడు బుల్లితెరపై కనిపిస్తున్నారు. స్వీయ నిర్మాణంలో దర్శకురాలిగా ఇష్క్ వాలా లవ్ అనే మరాఠి చిత్రం తీసిన అనుభవం ఉంది. ఇకపై తెలుగులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందనే వార్తల నేపథ్యంలో అనూహ్యంగా రేణు దేశాయ్ తిరిగి రావడం సర్ప్రైజ్ కలిగించేదే. క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉన్న తరుణంలో ఈవిడ కెరీర్ ని ఎలా సెట్ చేసుకుంటారో చూడాలి