iDreamPost
android-app
ios-app

మిస్టర్ బచ్చన్ vs డబుల్ ఇస్మార్ట్.. రెండిట్లో ఏ మూవీ బుకింగ్స్ బాగున్నాయి అంటే?

  • Published Aug 14, 2024 | 9:54 AM Updated Updated Aug 14, 2024 | 9:54 AM

Mr. Bachchan, Double Ismart bookings: మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ బుకింగ్స్ బాగున్నాయో ఇప్పుడు చూద్దాం.

Mr. Bachchan, Double Ismart bookings: మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ బుకింగ్స్ బాగున్నాయో ఇప్పుడు చూద్దాం.

  • Published Aug 14, 2024 | 9:54 AMUpdated Aug 14, 2024 | 9:54 AM
మిస్టర్ బచ్చన్ vs డబుల్ ఇస్మార్ట్.. రెండిట్లో ఏ మూవీ బుకింగ్స్ బాగున్నాయి అంటే?

ఆగస్టు 15 జెండా పండుగతో పాటుగా టాలీవుడ్ లో సినిమా పండగ రాబోతోంది. ఈ ఒక్కరోజే నాలుగు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ తో పాటుగా చియాన్ విక్రమ్ ప్రయోగాత్మక చిత్రం ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నటించిన ‘ఆయ్’ అనే మూవీ కూడా పోటీలో ఉంది. కాగా.. మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షోలను ఆగస్ట్ 14నే ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో రవితేజ-రామ్ మూవీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ సినిమాకు బాగున్నాయో ఓసారి చూద్దాం.

డైరెక్టర్ హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. విడుదలకు ఒకరోజు ముందే అంటే ఆగస్టు 14నే ప్రీమియర్ షోలు వేస్తున్నారు మేకర్స్. ఇక ఈ షోలకు సంబంధించి.. అప్పుడే హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. ఇక బుక్ మై షోలో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. అదీకాక మల్టీప్లెక్స్ లో భారీగా టికెట్లు తెగుతున్నాయి. ఇక్కడ మిస్టర్ బచ్చన్ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ. 31  కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. దాంతో 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రవితేజ బరిలోకి దిగబోతున్నాడు. సాలిడ్ బుకింగ్స్ ఉండటంతో.. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్, పాటలు, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, మాస్ మహారాజా యాక్షన్ ఈ సినిమాపై హైప్ తీసుకొచ్చాయి.

Mr Bachchan vs Double Smart

ఇక డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్-రామ్ కాంబినేషన్ లో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ కోసం మాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రచార చిత్రాలు మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ సైతం అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతోంది. మిస్టర్ బచ్చన్, తంగలాన్ మూవీస్ బరిలో ఉన్నాగానీ.. బుకింగ్స్ లో తన మార్క్ ను చూపెడుతూ ముందుకుసాగుతోంది. కాగా.. డబుల్ ఇస్మార్ట్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. దాంతో రూ. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రామ్ బరిలోకి దిగుతున్నాడు. మెుత్తానికి చూసుకుంటే ఈ రెండు చిత్రాలు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో సాలిడ్ రెస్పాన్స్ ను చురగొంటున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet