Somesekhar
Mr. Bachchan-Double ISmart: మిస్టర్ బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ మూవీలకు ట్రేడ్ వర్గాలు ఊహించినంతగా కలెక్షన్లు రాలేదు. అయితే దానికి ఓ కారణాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. దాని వల్లే వసూళ్లు తగ్గాయన్నది వారి వాదన. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Mr. Bachchan-Double ISmart: మిస్టర్ బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ మూవీలకు ట్రేడ్ వర్గాలు ఊహించినంతగా కలెక్షన్లు రాలేదు. అయితే దానికి ఓ కారణాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. దాని వల్లే వసూళ్లు తగ్గాయన్నది వారి వాదన. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
సినిమా.. పైకి కనిపించడానికి ఓ రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ దాని వెనక కొన్ని వందల, వేల మంది కష్టం ఉంది. 24 విభాగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నో ఆర్థిక, కష్ట-నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీటన్నింటిని దాటుకు మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పెద్ద యుద్ధమే చేయాలి. ఇంత చేసినా.. ఒక్కోసారి సినిమాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లను చేయకుండా ఉంటే.. ఆ చిత్రాలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదు. ఇప్పు ఇలాంటి పరిస్థితే మిస్టర్ బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ విషయంలో జరిగిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రవితేజ-రామ్ మూవీల కలెక్షన్లు తగ్గడానికి వారు ఓ కారణాన్ని ఎత్తి చూపుతున్నారు. మరి ఆ రీజన్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మిస్టర్ బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ రెండు చిత్రాలతో పాటుగా విక్రమ్ నటించిన ‘తంగలాన్’ నార్నె నితిన్ ‘ఆయ్’లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాయి. ఈ నాలుగు చిత్రాల్లో తంగలాన్, ఆయ్ మూవీలకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. తొలి రెండు రోజులు ఈ సినిమాలు బాగానే వసూళ్ చేశాయి. కానీ స్టార్ హీరోలు అయిన మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని పరిస్థితి ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. మిస్టర్ బచ్చన్ తొలిరోజు 5 కోట్ల లోపే ఓపెనింగ్స్ రాబట్టాడు. ఇక రామ్ వరల్డ్ వైడ్ గా రూ. 12.45 కోట్లు కొల్లగొట్టాడని మేకర్స్ ప్రకటించారు.
అయితే రెండో రోజుకు వచ్చేసరికి పరిస్థితి దారుణంగా పడిపోయింది. మిస్టర్ బచ్చన్ రూ. 1.75 కోట్లను వసూళ్ చేయగా.. రామ్ డబుల్ ఇస్మార్ట్ రూ. 2.25 కోట్లను సాధించింది. రెండు రోజుల్లో కలిసి రవితేజ మూవీ 8 కోట్లను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పూరీ చిత్రం రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 16 కోట్లు వసూళ్ చేసినట్లు తెలుస్తోంది. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవాలని బరిలోకి దిగిన ఈ రెండు సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోవడం చాలా బాధాకరం. అయితే మేకర్స్ కాస్త ఆలోచించి బరిలోకి దిగితే సేఫ్ అయ్యేవాళ్లు అని సినిమా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆగస్ట్ 15న ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో థియేటర్లు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మేకర్స్ కు తమ సినిమాలపై నమ్మకం ఉండటంతో బరిలోకి దిగేందుకే మెుగ్గు చూపారు కానీ.. థియేటర్లు, కలెక్షన్లు పంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఇదే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వసూళ్లు తగ్గడానికి కారణం అయ్యింది. ఈ మూవీలకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇలాంటి టైమ్ లో విడివిడి అంటే కొంత గ్యాప్ తో సినిమాలు రిలీజ్ చేసుకుని ఉంటే.. కలెక్షన్లు బాగుండేవి అన్నది సినీ పండితుల వాదన. అప్పుడు థియేటర్లు కావాల్సినన్ని దొరికేవి దాంతో వసూళ్లు కూడా పెరిగేవి. ఇది బ్రేక్ ఈవెన్ కు దారితీసేది. మేకర్స్ కొద్దిగా తగ్గి, కొంత గ్యాప్ లో వస్తే.. ఫలితం వేరేలా ఉండేదని సగటు సినిమా లవర్స్ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.