iDreamPost
android-app
ios-app

Vaali : రీమేక్ కాబోతున్న రెండు దశాబ్దాల పాత క్లాసిక్ ?

  • Published Nov 30, 2021 | 6:43 AM Updated Updated Nov 30, 2021 | 6:43 AM
Vaali :  రీమేక్ కాబోతున్న రెండు దశాబ్దాల పాత క్లాసిక్ ?

ఇప్పటి ఆడియన్స్ కి వెంటనే గుర్తుకురాకపోవచ్చేమో కానీ 1999లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వాలిని అజిత్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ టైంలో మెల్లగా ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్న తలాను ఒక్కసారిగా ఈ మూవీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం బాగా ఆడింది. కొన్ని సెంటర్స్ లో షిఫ్టింగ్ పద్ధతి మీద వంద రోజులు ఆడటం అప్పట్లో రికార్డు. సిమ్రాన్, జ్యోతిక హీరోయిన్లుగా నటించిన ఈ డిఫరెంట్ ఎంటర్ టైనర్ లో అజిత్ డ్యూయల్ రోల్స్ చేసి నెగటివ్ షేడ్స్ లోనూ అద్భుతంగా మెప్పించారు. దేవా పాటలు ఆడియో పరంగా చాలా సక్సెస్ అయ్యాయి. హీరో కెరీర్ బెస్ట్ మూవీస్ టాప్ 5లో వాలి స్థానం చాలా ప్రత్యేకమైంది.

ఇప్పుడా వాలిని మళ్ళీ రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ దీని తాలూకు హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ముందు ఈ ఒప్పందం చెల్లదంటూ వాలి దర్శకుడు ఎస్ జె సూర్య కోర్టుకెక్కారు. కానీ న్యాయ స్థానం తీర్పు ఒరిజినల్ వెర్షన్ నిర్మాతకు అనుకూలంగా రావడంతో బోనీకి రూటు క్లియర్ అయ్యింది. ప్రస్తుతానికి తెలుగు తమిళ మలయాళం భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. కన్నడ, హిందీకి సంబంధించి ఏవో చిక్కులు ఉండటం ప్రస్తుతం ఆ ప్రతిపాదనను వెనక్కు పెట్టారు. మరి ఏ బాషకు ఎవరు హీరో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

వాలిని రీమేక్ చేయడం మంచి ఆలోచనే కానీ ఆ మేజిక్ ని రీ క్రియేట్ చేయడం అంత సులభం కాదు. పైగా అజిత్ లాంటి ఆర్టిస్టుని సెట్ చేసుకోవాలి. మంచి పాటలు కావాలి. అన్నిటిని మించి వాలి ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. దాన్ని కోట్లలో ప్రేక్షకులు చూసేసి ఉంటారు. మళ్ళీ థియేటర్లో చూడాలంటె బలమైన కారణాలు సృష్టించాలి. ఇవన్నీ సవాళ్ళే. మరో బోనీ ప్లానింగ్ ఎలా ఉండబోతోందో తెలియాలి. పవన్ కళ్యాణ్ తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య డెబ్యూ మూవీ ఇది. ఇప్పుడంటే ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు కానీ కెరీర్ ప్రారంభంలో రెండు క్లాసిక్స్ తర్వాత డైరెక్టర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు

Also Read : 1983 Cricket World Cup : వెండితెరపై మొదటి వరల్డ్ కప్ విజయం