iDreamPost
android-app
ios-app

దేశంలో మొట్టమొదటి కరోనా హాస్పిటల్ ప్రారంభించిన రిలయన్స్

దేశంలో మొట్టమొదటి కరోనా హాస్పిటల్ ప్రారంభించిన రిలయన్స్

దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా 101 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్రలో కర్ఫ్యూ విధించారు.ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వానికి సహాయ పడేందుకు ‘రిలయన్స్‌’ సంస్థ దేశంలోనే తొలిసారిగా ముంబయిలో ప్రత్యేకంగా కొవిడ్‌-19 ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.

ముంబాయి నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో వంద పడకల ఆసుపత్రిని రెండు వారాల సమయంలో సర్‌ హెచ్‌.ఎన్‌. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముంబాయిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో సిద్ధం చేసింది.కొవిడ్‌-19 సోకినా బాధితుల కోసం ఏర్పాటు చేయడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత.దీని నిర్వహణా ఖర్చు మొత్తాన్నీ రిలయన్స్‌ ఫౌండేషన్‌ భరిస్తుంది.ఈ ఆసుపత్రిలో ఒకరి నుండి ఒకరికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణలో ఉంచేందుకు ‘నెగిటివ్‌ ప్రెజర్‌ రూమ్‌’ను కూడా ఏర్పాటు చేశారు.

రిలయన్స్‌ ఫౌండేషన్‌ వారి ఆసుపత్రిలో కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటు, అనుమానితులను విడివిడిగా ఉంచడానికి ప్రత్యేక వైద్య సౌకర్యాలు ఉన్నాయి. ఆసుపత్రిలోని అన్ని పడకలకూ వెంటిలేటర్లు, పేస్‌మేకర్లు, డయాలసిస్‌ యంత్రం, పర్యవేక్షణ సాధనాలు వంటి మౌలిక వసతులు కల్పించారు.
రిలయన్స్‌ ఫౌండేషన్‌ మహారాష్ట్రలోని లోధివాలిలో పూర్తి వసతులు కలిగిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా అధికారులకు అప్పగించారు.

విదేశాలనుండి ‘రిలయన్స్‌ లైఫ్‌ సైన్స్‌ విభాగం’ వారు వేగంగా కరోనా వైరస్‌ను నిర్ధరించడానికి అవసరమైనా పరీక్ష కిట్లు,ఉపకరణాలను దిగమతి తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.దేశంలో మాస్కుల కొరతను అధిగమించడానికి ఉత్పత్తిని వేగవంతం చేస్తామని తెలిపింది.ఈ విపత్కర పరిస్థితుల్లో ఆపన్నహస్తం అందించడానికి ఉచిత భోజనంతో పాటు ఇంధనాన్ని తమ సంస్థ అందిస్తుందని తెలిపారు.