Idream media
Idream media
జగన్ ప్రభుత్వంలో రెడ్డి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, కమ్మ వారు అని తెలిస్తే తీసి పక్కన పడేస్తున్నారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శించారు. ప్రతి విషయంలో కమ్మ కమ్మ అంటూ గోల చేస్తున్నారని రాయపాటి అభ్యంతరం వ్యక్తం చేశారు. కమ్మ వారు ఏం చేస్తారులే అనుకోవద్దని.. వారు తలుచుకుంటే జగన్ లేచి పోతాడని రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించడం సరికాదని వ్యాఖ్యానించారు.
మూడు రాజధానులు సరికాదని రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. రాజధానిని తరలిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక రాజధాని విషయంపై తాను ప్రధాని మోదీతో సమావేశం అవుతామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
నరసరావుపేట మాజీ ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. రివర్స్ టెండర్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనుల నుంచి తన సంస్థ అయిన ట్రాన్స్ ట్రాయ్ ని తొలగించిన సందర్భంలో రాయపాటి పెద్దగా స్పందించలేదు. మూడు రాజధానులు ప్రకటించిన సమయంలోనూ, రాజధాని గ్రామాల్లో ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనూ .. ఆ వ్యవహారం పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాంటి రాయపాటి సాంబశివరావు దాదాపు 11 నెలల తర్వాత అకస్మాత్తుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది.ఎవరు అధికారంలో ఉన్నా వారితో ఎదో విధంగా సర్దుకొని పోయే రాయపాటి రాజకీయాన్ని జగన్ పడనియ్యలేదు.
బహిరంగంగా తీవ్ర విమర్శలు చేసే అలవాటు లేని రాయపాటి ఇప్పుడు కులం పేరుతొ విమర్శలు చేసి,తాము తలుకుంటే జగన్ లేచిపోతాడనటం సంచలనం కలిగిస్తుంది. సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ అయినా రాయపాటి ముఖ్యమంత్రి జగన్ ను బెదిరింపు ధోరణిలో మాట్లాడటం చూసి టిడిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మీద విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడిపందాలలో వాడే కత్తితో హత్యాయత్నం జరిగిన సంఘటనను ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.