iDreamPost
android-app
ios-app

Ravi Teja వీరయ్యలో రవితేజ క్యారెక్టర్

  • Published May 05, 2022 | 12:47 PM Updated Updated May 05, 2022 | 3:47 PM
  • Published May 05, 2022 | 12:47 PMUpdated May 05, 2022 | 3:47 PM
Ravi Teja వీరయ్యలో రవితేజ క్యారెక్టర్

నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పేరు వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఆచార్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పేశారు. దానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్ వెకేషన్ బ్రేక్ కోసం అమెరికా వెళ్లగా టీమ్ మిగిలిన పనుల్లో బిజీగా ఉంది. ఇందులో రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. క్యామియో అనలేని ఎక్కువ లెన్త్ తో దీన్ని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్టు ఆల్రెడీ లీక్స్ ఉన్నాయి. ఆచార్యలో రామ్ చరణ్ గురించి కూడా ఇలాగే ఊరించి చంపేశారు కానీ ఈ వీరయ్యలో అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇక ఆ క్యారెక్టర్ విషయానికి వస్తే రవితేజ వాల్తేరు వీరయ్యలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. భార్యగా క్యాథరిన్ త్రెస్సా నటించగా ఈ ఇద్దరికీ ఒక బేబీ కూడా ఉంటుందని తెలిసింది. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందా లేక సమాంతరంగా చిరుతో పాటు ప్రయాణం చేస్తుందా అనేది చూడాలి. ఇదే తరహా ఖాకీ దుస్తుల పాత్రలో మాస్ మహారాజా క్రాక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు గతంలో విక్రమార్కుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ని తన ఎనర్జీతో వాటిని నిలబెట్టాడు. ఆల్రెడీ రవితేజ క్యాథరిన్ కాంబోలో కొన్ని సీన్స్ చేశారు. మిగిలిన క్యాస్టింగ్ తో కాంబినేషన్ ఎపిసోడ్స్ ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారం నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలిసింది.

గతంలో అన్నయ్యలో చిరుతో స్క్రీన్ పంచుకున్న రవితేజ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలో భాగం కావడం విశేషం. లీక్స్ బాగానే ఉన్నాయి కానీ వాల్తేరు వీరయ్య ఈ ఏడాది విడుదల కాకపోవచ్చు. ఆచార్య డిజాస్టర్ అయ్యింది కాబట్టి గాడ్ ఫాదర్ ని ఆగస్ట్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే వీరయ్యని 2023 మార్చి లేదా ఏప్రిల్ కు తీసుకొస్తారు. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ రేంజ్ మాస్ ఇందులో ఉంటుందని బాబీతో పాటు నిర్మాతలు తెగ ఊరిస్తున్నారు. దానికి రవితేజ తోడైతే రేగే రెస్పాన్స్ ఏ స్థాయిలో వుంటుందో వేరే చెప్పాలా. శృతి హాసన్ ఇందులో మెయిన్ హీరోయిన్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio