iDreamPost
android-app
ios-app

Mass Maharaja Ravi Teja : మాస్ మహారాజా తగ్గడం లేదట

  • Published Dec 08, 2021 | 8:18 AM Updated Updated Dec 08, 2021 | 8:18 AM
  • Published Dec 08, 2021 | 8:18 AMUpdated Dec 08, 2021 | 8:18 AM
Mass Maharaja Ravi Teja : మాస్ మహారాజా తగ్గడం లేదట

బాబీ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మిస్తున్న మెగా 154 రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒకే నెలలో నాలుగు షూటింగులు చేస్తున్న సీనియర్ స్టార్ గా ఇప్పటికే చిరంజీవి పేరు సోషల్ మీడియాలో మ్రోగుతోంది. ఇదిలా ఉండగా ఇందులో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి గతంలోనే లీకై గట్టి ప్రచారం దక్కింది. ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం ఇది నిజమేనట. ఇందుకు గాను అక్షరాలా 7 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇలాంటివి అధికారికంగా చెప్పరు కాబట్టి అనఫీషియల్ గా వచ్చిన న్యూస్ ప్రకారం ఇది వాస్తవమేనని అంటున్నారు కానీ ఖరారుగా చెప్పలేం.

ఇంత మొత్తం పారితోషికం అంటే ఇది చిన్న క్యామియో కాదు. చిరంజీవికి తమ్ముడిగా చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారని వినికిడి. ఈ ఇద్దరు కలిసి చివరిసారి కనిపించింది అన్నయ్యలో. అప్పటికింకా రవితేజకు అంత ఇమేజ్ లేదు. ఇప్పుడు కథ వేరు. క్రాక్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాక మార్కెట్ మళ్ళీ తిరిగి వచ్చింది. కేవలం నెలన్నర గ్యాప్ లో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలతో పలకరించబోతున్నాడు. ఇందులో ఒకటి హిట్ అయినా చాలు బండి దూసుకుపోతుంది. తిరిగి ధమాకాతో సంబరం కంటిన్యూ అవుతుంది. కట్ చేస్తే 2023లో చిరంజీవి కాంబోలో చేసిన ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.

దీనికి వాల్తేర్ వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది. రిజిస్టర్ చేశారని వినిపించింది కానీ ఈ మధ్య ఆ వివరాలు ఫిలిం ఛాంబర్ బయటికి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆచార్య పూర్తి చేసిన చిరు వీలు దొరికినప్పుడంతా గాడ్ ఫాదర్ ని కానిచ్చేస్తున్నారు. నయనతార, సల్మాన్ ఖాన్ డేట్లు దొరికాక వాళ్లకు సంబందించిన కాంబినేషన్ సీన్స్ పూర్తి చేస్తారు. భోళా శంకర్ కూడా మరోపక్క కొనసాగుతుంది. ముందు విడుదలయ్యేవి మాత్రం ఆచార్య, గాడ్ ఫాదర్ లే. ఒకవేళ టైం అనుకూలిస్తే సంవత్సరం చివరిలోపు మెహర్ రమేష్ సినిమా కూడా వచ్చేస్తుంది. మొత్తానికి మెగాస్టార్ కాంబినేషన్లు మాత్రం మాంచి క్రేజీగా సెట్ చేసుకుంటున్నారు

Also Read : Pragya Jaiswal : నెగటివ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందిగా

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibom