iDreamPost
iDreamPost
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి చప్పగా సాగుతున్న బిగ్ బాస్ 5 ని కాపాడేందుకు నాగార్జున ఎన్ని విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం ఎప్పటికప్పుడు నీరసంగానే వస్తోంది. మొదట్లో రేటింగ్స్ పర్వాలేదనిపించినా తర్వాత అవీ నెమ్మదించాయి. రామ్ చరణ్ లాంటి గెస్టులు వచ్చినా లాభం లేకపోయింది. చైతు, అఖిల్, పూజా హెగ్డేని తీసుకొచ్చినా ఉపయోగం కలగలేదు. ఇవన్నీ నిర్వాహకుల చొరవ కన్నా నాగ స్వంత పలుకుబడి ఇంటరెస్ట్ తో చేయించినవి. అసలు కంటెంట్ లోనే తేడా ఉన్నప్పుడు ఇలాంటి హంగులు ఎన్ని జోడించిన ప్రయోజనం ఏముంటుంది. ఇక క్లైమాక్స్ కు దగ్గరవుతున్న వేళ ఆఖరి బ్రహ్మాస్త్రం ఉపయోగించబోతున్నారట.
బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలుగా రన్బీర్ కపూర్, ఆలీయా భట్ లను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమయ్యిందట. వాళ్ళు ఎందుకు వస్తున్నారనే అనుమానం రావడం సహజం. దానికీ కారణం ఉంది. రన్బీర్, అలియాలు కలిసి మల్టీ స్టారర్ బ్రహ్మాస్త్ర చేశారు. ఇది 2022 ద్వితీయార్థంలో విడుదల కాబోతోంది. ఇందులో నాగార్జున చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ చేశారు. దానికి తోడు పై ఇద్దరు నిజ జీవితంలోనూ భార్యాభర్తలు కాబోతున్నాయి. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. ఇటీవలే ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్స్ లో అలియా ఒప్పేసుకుంది కూడా. సో బిగ్ బాస్ కు వస్తే రెండు సినిమాల విశేషాలను పంచుకునే ఛాన్స్ దొరుకుతుంది.
మొత్తానికి బిగ్ బాస్ కోసం హిందీ తారల అవసరం పడిందన్న మాట. అయితే వీళ్ళను ఫైనల్ ఎపిసోడ్ కోసం వాడుకుంటారా లేక వేరే ప్లానింగ్ ఏమైనా ఉందా తెలియాలి. ప్రేక్షకుల్లో ఆదరణ ఉన్న పార్టిసిపెంట్స్ ని ఎలిమినేట్ చేయడం, హౌస్ లో అర్థం లేని ప్రేమాయణాలు ఇవన్నీ మైనస్ గా మారుతున్నాయి. అందుకే ఏవేవో అట్రాక్షన్లు జోడించే ప్రయత్నాలు చేస్తున్నారు. షణ్ముఖ్, శ్రీరామ చంద్రల పేరు మీద ఫ్యాన్స్ ఆర్మీలంటూ హడావిడి మొదలుపెట్టారు కానీ ఇవి కౌశల్ రేంజ్ లో ప్రయోజనం పొందుతాయని అనిపించడం లేదు. వచ్చే సీజన్ కి నాగార్జున వ్యాఖ్యాతగా కొనసాగాలంటే ఇంకేదో బలంగా చేయాలి
Also Read : Acharya & F3 : ఆచార్య ఎఫ్3 – మార్పు తప్పదా ?