iDreamPost
android-app
ios-app

“క్లింకార” ఆయా నెల జీతం అంతా! వైరల్ అవుతున్న న్యూస్

  • Published Feb 05, 2024 | 2:32 PM Updated Updated Feb 05, 2024 | 2:32 PM

మొన్నీమధ్యన మెగా కుటుంబంలో అడుగుపెట్టిన.. మెగా లిటిల్ ప్రిన్సెస్ "క్లింకార" గురించి వచ్చే ప్రతి వార్త ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా క్లింకార కేర్ టేకర్ శాలరీ గురించి.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మొన్నీమధ్యన మెగా కుటుంబంలో అడుగుపెట్టిన.. మెగా లిటిల్ ప్రిన్సెస్ "క్లింకార" గురించి వచ్చే ప్రతి వార్త ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా క్లింకార కేర్ టేకర్ శాలరీ గురించి.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

  • Published Feb 05, 2024 | 2:32 PMUpdated Feb 05, 2024 | 2:32 PM
“క్లింకార” ఆయా నెల జీతం అంతా! వైరల్ అవుతున్న న్యూస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు “క్లింకార”ను ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు. ఎప్పుడైనా మెగా కుటుంబానికి సంబంధిచిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా.. కూడా ఈ పసిడి బొమ్మ ఫోటోను మాత్రం దాచేస్తూ ఉంటారు. ఇక మెగా లిటిల్ ప్రిన్సెస్ ను అందరికి ఎపుడు చూపిస్తారో.. వేచి చూడాలి మరి. అయితే, స్టార్ సెలెబ్రిటీల ఇళ్లలో ఇలా పిల్లలను చూసుకునేందుకు కేర్ టేకర్స్ ఉండడం సహజం. వారికీ తగిన జీతాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో రామ్ చరణ్ , ఉపాసనల కూతురును చూసుకునేందుకు ఉన్న.. కేర్ టేకర్ జీతం విషయంలో కొన్ని ఆసక్తి కర కథనాలు వినిపిస్తున్నాయి. ఆ జీతం ఎంతో తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

రామ్ చరణ్ ఓ పక్క సినిమాలలో బిజీగా ఉన్నా సరే.. మరో పక్క ఫ్యామిలీకి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులకు “క్లింకార” జన్మించడంతో.. మెగా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ పాపకు సంబంధించిన ప్రతి చిన్న వేడుకను కూడా ఎంతో ఘనంగా జరిపిస్తున్నారు. కానీ, ఇంతవరకు ఆ పాప ఎలా ఉంటుంది అని మాత్రం ఎవరికీ చూపించలేదు. ఇక ఇలాంటి సెలెబ్రిటీల ఇళ్లలో .. పిల్లలను చూసుకోడానికి కేర్ టేకర్స్ ఉండడం సహజం. అటు రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉండడం. ఇటు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్స్ పనుల్లో బిజీగా ఉన్నపుడు.. వారి పాపను జాగ్రత్తగా చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ ను నియమించుకున్నారు. ఆమె గతంలో కూడా స్టార్ సెలబ్రెటీ పిల్లలకు కేర్ టేకర్ గా వర్క్ చేసిందట. ఆమె పేరు సావిత్రి. ప్రస్తుతం ఈమెకు మెగా కుటుంబం ఇచ్చే జీతం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కాగా, గతంలో కరీనా కపూర్ కొడుకుకు కూడా సావిత్రిని కేర్ టేకర్ గా వర్క్ చేసిందట. ఇక ఇప్పుడు “క్లింకార”కు కేర్ టేకర్ గా వర్క్ చేస్తోంది. ఇక ఈమె నెల జీతం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ.. ఆమెకు దాదాపు నెలకు 5 లక్షలకు పైగానే జీతం ఇస్తున్నట్లు సమాచారం. వాటితో పాటు పండుగ బోనస్లు, గిఫ్టులు ఇలా ఉంటూనే ఉంటాయట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఇది చూసిన నెటిజన్లు .. సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇలా చేసుకోవడమే మేలు అంటూ.. రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, ‘క్లింకార’ కేర్ టేకర్ జీతం విషయంలో వినిపిస్తున్న సమాచారంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/