iDreamPost
android-app
ios-app

స్పీడ్ పెంచిన మెగా పవర్ స్టార్

  • Published Aug 02, 2021 | 6:06 AM Updated Updated Aug 02, 2021 | 6:06 AM
  • Published Aug 02, 2021 | 6:06 AMUpdated Aug 02, 2021 | 6:06 AM
స్పీడ్ పెంచిన మెగా పవర్ స్టార్

సాహో విడుదలకు ముందు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సుజిత్ దాని ఫలితం తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదురుకోవాల్సి వచ్చిందో చూశాం. ఏ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేకపోయింది. చిరంజీవి లూసిఫర్ రీమేక్ బాధ్యతను ముందుగా తనకే అప్పజెప్పినప్పటికీ అంచనాలకు తగ్గట్టు స్క్రిప్ట్ సిద్ధం చేయలేకనో లేక అంత ఒత్తిడి భరించలేకనో మొత్తానికి అందులో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అది వినాయక్ దగ్గరికి వెళ్లి చివరికి మోహన్ రాజా వద్ద లాక్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సుజిత్ నెక్స్ట్ మూవీ ఏంటనే దాని గురించి సరైన స్పష్టత లేకపోయింది. ఇప్పుడు ఓ కొలిక్కి వస్తున్నట్టు తెలిసింది.

Also Read: కండల వీరుడి సరసన నభ ?

ఆచార్య, ఆర్ఆర్ఆర్, శంకర్ మూవీ తర్వాత రామ్ చరణ్ సుజిత్ తోనే చేయబోతున్నట్టు వినికిడి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో సాహో లాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాకుండా ఈసారి కమర్షియల్ ఎంటర్ టైనర్ ని సిద్ధం చేయబోతున్నారట. అంటే రన్ రాజా రన్ టైపులో అన్ని అంశాలు ఉండేలా సుజిత్ ఫ్రెష్ స్క్రిప్ట్ రాసుకునట్టు ఇన్ సైడ్ న్యూస్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే ఖరారుగా చెప్పలేం. లూసిఫర్ రీమేక్ ని డ్రాప్ చేసుకున్న టైంలోనే సుజిత్ ఒక సినిమా చేస్తానని చరణ్ మాట ఇచ్చాడట. దీని వెనుక ప్రభాస్ ప్రోత్సాహం కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలిసింది.

సో ఈ లెక్కన వినయ విధేయ రామా తర్వాత వచ్చిన పెద్ద గ్యాప్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా రామ్ చరణ్ మంచి ప్లాన్ తో సినిమాలు లైన్ లో పెడుతున్నట్టు కనిపిస్తోంది. మూడు కన్ఫర్మ్ కాగా ఇప్పుడు సుజిత్ ది ఒకే అయితే నాలుగు అవుతాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. శంకర్ సినిమా కూడా 2022లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన సుజిత్ మూవీని వచ్చే ఏడాది చివరిలోగా ప్రారంభించవచ్చు. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 విడుదలకే కట్టుబడిన నేపధ్యంలో ఆచార్య రిలీజ్ ఎప్పుడనేది సస్పెన్స్ గా మారింది

Also Read: తారక్ ముందున్న భారీ లక్ష్యం

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet