కండల వీరుడి సరసన నభ ?

By iDream Post Aug. 01, 2021, 04:00 pm IST
కండల వీరుడి సరసన నభ ?

ఒక్కోసారి పెద్ద హిట్టు వచ్చినా టైం అంతగా కలిసిరాకపోతే అవకాశాలు వెంటనే రావు. వచ్చినా విజయం ఆలస్యమవుతుంది. పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ లో రామ్ తో ధీటుగా ఊర మాస్ హీరోయిన్ పాత్రలో మెప్పించిన నభ నటేష్ కు ఆఫర్లు క్యూ కట్టలేదు. సర్లే సక్సెస్ దక్కితే చాలనుకుని సీనియర్ హీరో రవితేజ పక్కన చేసిన డిస్కో రాజా మరీ దారుణంగా డిజాస్టర్ కొట్టడం ఊహించనిదే. సాయి తేజ్ తో చేసిన సోలో బ్రతుకే సో బెటరూ పరవాలేదనిపించినా అల్లుడు అదుర్స్ మాత్రం ఇంకో దెబ్బ గట్టిగా చేసింది. దాని వల్ల జరిగిన ప్లస్సేమీ లేకపోగా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం తను మాస్ట్రో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా నభ నటేష్ కు అదిరిపోయే వెబ్ సిరీస్ ఆఫర్ ఒకటి వచ్చిందని సమాచారం. ఇందులో అంత ఆశ్చర్యపోయేది ఏముందనుకుంటున్నారా. కండల వీరుడు హృతిక్ రోషన్ సరసన అంటే అంతకంటే అదిరిపోయే ఛాన్స్ ఏముంటుంది. బ్రిటిష్ థ్రిల్లర్ ది నైట్ మేనేజర్ ఆధారంగా రూపొందబోయే ఈ సిరీస్ లో నభకు చాలా కీలకమైన పాత్ర దక్కిందట. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈ సిరీస్ కి ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. దర్శకుడు టీమ్ తదితర వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు.

నిజానికి ఇప్పుడు హీరోయిన్లు కాంబినేషన్లు రెమ్యునరేషన్లు చూస్తున్నారు కానీ సినిమాలు వెబ్ సిరీస్ లని తేడాలను చూడటం లేదు. అందుకే తమన్నా, కాజల్ అగర్వాల్, అమలా పాల్, సాయి పల్లవి లాంటి వాళ్ళు ఆల్రెడీ డిజిటల్ డెబ్యూ చేసేశారు. మరికొందరు ఇదే బాటలో ఉన్నారు. ఓటిటి స్పేస్ కు రాను రాను ప్రాధాన్యం పెరిగిపోతున్న క్రమంలో అందివచ్చిన అవకాశాలను వాడుకోవడమే ఇప్పుడు చేయాల్సిన పని. అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సూర్య, విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు చేయగా లేనిది బిగ్ స్క్రీన్ లోనే నటిస్తామని బిగదీసుకు కూర్చుంటే నష్టమెవరికో అర్థమవుతోందిగా.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp