iDreamPost
iDreamPost
రాష్ట్రంలో ఉన్న ఒక వర్గం మీడియా అంతా కలిసి వై.సి.పిలో రెబల్ ఎం.పి గా ముద్రవేసిన రఘురామ కృష్ణం రాజు ఎట్టకేలకు తన భావం బయట పెట్టారు. గత నాలుగు రోజులుగా పార్టీ పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన పార్టీ మారబోతున్నారని కధనాలు రాసిన మీడియాకు షాకిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఇసుక సమస్య పై జగన్ గారితో మాట్లాడానని ఆయన వెంటేనే పరిష్కార మార్గం దిశగా చర్యలు చేపట్టారని , సీయం జగన్ పరిపాలన దక్షత భేష్ అని, కచ్చితంగా జగన్ వై.యస్.ఆర్ గారి కన్నా మంచి పేరు తెచ్చుకుని సుదీర్గంగా అధికారంలో కొనసాగటం ఖాయమని చెప్పుకొచ్చారు.
ఇంకా రఘురామ కృష్ణం రాజు గారు మాట్లాడుతూ ఇసుక సమస్యమీద రెండు రోజుల క్రితం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లానని, అయితే ముఖ్యమంత్రి జగన్ గారు ఈ సమస్య పై మేము చెప్పిన వెంటనే స్పందించిన తీరు అపూర్వం అని, ముఖ్యమంత్రి గారు గత రెండు రోజులుగా ఈ సమస్యకి ఎలా పరిష్కార మార్గం చూపాలా అని కలెక్టర్లు అందరితో మేధోమధనం చేసి పరిష్కారం దిశగా అడుగులు వేశారని , రాబోయే రెండు మూడు రోజుల్లోనే ధరలు దిగిరావాలని చెప్పారని. ఇక పై బల్క్ ఆర్డర్లకు జాయింటు కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేయడం తో పాటు, మనం ఏర్పాటు చేసుకున్న గ్రామ సచివాలయ వ్యవస్థలోనే ఇసుకని బుక్ చేసుకుని, అలాగే చిన్న చిన్న అవసరాలకు దగ్గరిలోని వారికి ఎడ్ల బండ్లు మీద ఉచితంగా తీసుకుని వెళ్ళే వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారని. ఇంత జటిలమైన సమస్యని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన రెండు రోజుల్లోనే పరిష్కారం చూపించగలిగారని, మీ సమర్దతకు ప్రజలందరి తరుపున దన్యవాదాలని. అలాగే ఏ సమస్యలు ఉన్నా కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చెస్తానని చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న జగన్ పాలనలో బయటికి అంతా బాగానే ఉన్న పార్టీలో మాత్రం నిరసనలు తీవ్రంగా ఉన్నాయని చెప్పుకొచ్చిన ఎల్లో మీడియాకు రఘురామ కృష్ణం రాజు చెప్పిన మాటలు తీవ్ర నిరాశ కలిగించి ఉండవచ్చు. ఏ ప్రభుత్వంలో అయిన పాలనా పరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఆ సమస్యలను ప్రజా ప్రతినిధులు పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం సహజం . దీనికి ఎల్లో మీడియా తీవ్రతరం చేసి చూపే ప్రయత్నం చేసినా ఆ పధకం ఫలించలేదనే సెటయిర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి .