iDreamPost
android-app
ios-app

‘ప్రియ’మైన లుక్స్ తో డబుల్ ట్రీట్

  • Published Jun 04, 2020 | 6:07 AM Updated Updated Jun 04, 2020 | 6:07 AM
  • Published Jun 04, 2020 | 6:07 AMUpdated Jun 04, 2020 | 6:07 AM
‘ప్రియ’మైన లుక్స్ తో డబుల్ ట్రీట్

17 ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో ఎవరే అతగాడు లాంటి ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి ఆ తర్వాత జగపతిబాబు పెళ్ళైన కొత్తలో, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ, నాగార్జున రగడలతో త్వరగానే హిట్లు కొట్టి అటుపై నితిన్, కళ్యాణ్ రామ్, గోపి చంద్ లాంటి హీరోలతో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. కాని ఆ తర్వాత గ్రాఫ్ ఆశించినంత వేగంగా సాగలేదు. వరస పరాజయాలు కెరీర్ మీద ప్రభావం చూపించాయి. దాంతో కొంచెం త్వరగానే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇటీవలే హిందీలో వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని మూవీస్ చేస్తున్న ప్రియమణి తాజాగా రెండు క్రేజీ తెలుగు సినిమాలతో కం బ్యాక్ ఇస్తోంది.

ఇవాళ పుట్టినరోజు సందర్భంగా అయా యూనిట్లు ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశాయి. వెంకటేష్ హీరోగా తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా రూపొందుతున్న నారప్పలో పక్కా పల్లెటూరి మహిళగా ప్రియమణి చాలా డిఫరెంట్ రోల్ చేస్తోంది. పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఉన్న ఈ పాత్రలో వెంకటేష్ సరసన భార్యగా కనిపించబోతోంది. మన ఊరి రామాయణం తర్వాత నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ ఇదే.ఇక రెండోది రానా, సాయి పల్లవిల మొదటిసారి కాంబినేషన్ లో రూపొందుతున్న విరాట పర్వంలోది. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో 90 దశకం నేపధ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల రూపొందిస్తున్న ఈ రియలిస్టిక్ డ్రామాలో ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా కనిపించబోతోంది.

ఆ తరహా దుస్తులతో ఉన్న ఆమె లుక్ ని పోస్టర్ రూపంలో వదిలింది నిర్మాణ సంస్థ. రెండూ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలోవే కావడం గమనార్హం. రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహాలో కాకుండా చాలా డిఫరెంట్ గా రూపొందుతున్న ఈ రెండు సినిమాలు కనక హిట్ అయితే ప్రియమణికి పవర్ ఫుల్ కంబ్యాక్ గా నిలిచిపోతాయి. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సిరివెన్నెల అనే మరో చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా కన్నడలో డాక్టర్ 56, బాలీవుడ్ లో మైదాన్ చిత్రాలు కమిట్ అయిన ప్రియమణి మొత్తానికి రాబోయే రోజుల్లో చాలా బిజీగా మారేలా ఉంది. తాజాగా ఇచ్చిన డబుల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss