Idream media
Idream media
గత వారం రోజులుగా రాజధాని అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు, మహిళా ఉద్యోగినితో జరిపిన అభ్యంతరకర సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ మీడియాకు లీక్ అవడంతో పృథ్వీరాజ్ వ్యవహారశైలిపై మీడియాలో పెద్ద ఎత్తున ఉదయం నుండి చర్చ జరుగుతుంది.
ఆడియో టేపుల వ్యవహారాన్ని టీటీడీతో పాటు వైసీపీ పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది.ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి టీటీడీ ఛైర్మన్ తీసుకెళ్లగా పృథ్వీరాజ్ పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు .
సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పృథ్వీరాజ్ ను కోరగా,కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీ మహిళా ఉద్యోగినితో అసభ్యంగా జరిపిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ నిన్న రాత్రి మీడియాకు లీక్ కావడంతో పృథ్వీ రాజ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని తెలుగు రాష్ట్రాలలో వెంకటేశ్వర స్వామి భక్తులు, టీటీడీ ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేశాయి.ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు ఇప్పటికే విచారణ కూడా చేపట్టింది.
వ్యక్తులు బాధ్యతగా ఉండాలి,పదవుల్లో ఉన్నవాళ్లు ఇంకా బాధ్యతగా ప్రవర్తించాలి. ఇచ్చిన బాధ్యతను అర్ధం చేసుకొని రాణించకుండా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల మీద దాచేసిన ధోరణిలోనే మాట్లాడటం తగదు అని పృథ్వీ వ్యవహారం చూస్తే అర్ధమవుతుంది.