iDreamPost
android-app
ios-app

TTDలో జాబ్స్‌.. ఒక్కరోజే అవకాశం.. పూర్తి వివరాలివే

  • Published Aug 21, 2024 | 8:21 AM Updated Updated Aug 21, 2024 | 8:21 AM

TTD-Civil Assistant Surgeons:నిరుద్యోగులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఖాళీగా ఉన్న కొన్ని కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

TTD-Civil Assistant Surgeons:నిరుద్యోగులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఖాళీగా ఉన్న కొన్ని కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Aug 21, 2024 | 8:21 AMUpdated Aug 21, 2024 | 8:21 AM
TTDలో జాబ్స్‌.. ఒక్కరోజే అవకాశం.. పూర్తి వివరాలివే

నేటి కాలంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి మార్కులతో డిగ్రీ పాస్‌ అయిన వారికి కూడా ఉద్యోగం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత కాలంలో జాబ్‌ రావాలంటే.. మార్కుల కన్నా కూడా ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్‌, కొత్త ట్రెండ్స్‌, టెక్నాలజీల గురించి తెలుసుకుని ఉండాలి. అలాంటి వారికే ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేటు రంగంలో అయితే ఇదే పరిస్థితి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే మాత్రం.. పాత ధోరణినే ఫాలో అవ్వాలి. సదరు బోర్డులు నిర్ణయించిన సిలిబస్‌ మేరకు ప్రిపేర్‌ అవ్వాలి. ఇక ఉద్యోగం అనగానే ఎక్కడో దూరంగా కాకుండా.. సొంత రాష్ట్రంలోనే జాబ్‌ దొరికితే ఎక్కువ సంతోషిస్తారు. అదుగో మీరు కూడా మీ ప్రాంతంలోనే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. టీటీడీ మీకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. బోర్డుకు చెందిన ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఒక సంవత్సరానికి గాను కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా సేవలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంబీబీఎస్‌ విద్యార్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక మొత్తం 5 అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు ఉండగా.. వీటిల్లో  బీసీ బీ (మ) -01, ఎస్టీ(మ)– 01, బీసీ బీ -01, ఎస్‌సీ -01, బీసీ డీ(మ)- 01 కేటగిరీల వారీగా ఖాళీలున్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల అనగా ఆగస్టు 29వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

jobs in ttd

ఈ పోస్టుల భర్తీ కోసం తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని సెంట్రల్ ఆస్పత్రిలో ఉదయం 11 గంటలకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జ‌రుగ‌నుంది. ఆసక్తి గల అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, వారి అనుభ‌వానికి సంబంధించిన పత్రాల ఒరిజినల్, జిరాక్స్ ‌ కాపీలతో ఇంట‌ర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అలానే కార్యాలయ పని వేళల్లో 0877-2264371 సంప్రదించాలని టీటీడీ సూచించింది. మీకు కూడా ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకొండి.

ఇదిలా ఉంచితే.. టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగష్టు 27వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా  శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టీటీడీ శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూమాలలతో అలంకారాలు చేపట్టనుంది. ఆరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.