iDreamPost
android-app
ios-app

లైఫ్‌లో మళ్లీరాని ఛాన్స్.. TTDలో నెలకు 2 లక్షల జీతంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

  • Published Oct 01, 2024 | 12:52 PM Updated Updated Oct 01, 2024 | 12:52 PM

TTD Jobs: మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. టీటీడీలో నెలకు 2 లక్షల జీతంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

TTD Jobs: మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. టీటీడీలో నెలకు 2 లక్షల జీతంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

లైఫ్‌లో మళ్లీరాని ఛాన్స్.. TTDలో నెలకు 2 లక్షల జీతంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ఏదైనా సాధించానే ఆసక్తి అందరికీ ఉంటుంది.. కానీ, ఆ శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. నీతోనే నీ ఇంటి పేదరికం ఆగిపోవాలంటే నీ కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అంకితభావంతో కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుంది. ప్రస్తుత సమాజంలో సక్సెస్ అయిన వారంతా కష్టపడి పైకొచ్చిన వారే. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడాల్సిన బాధ్యత మీపైనే ఉంది. వారు కష్టపడి పెంచి, పెద్దచేసి చదివించింది మీరు కష్టాలపాలు కాకూడదనే. మరి మీ పేరెంట్స్ కన్న కలల్ని నిజం చేసే అవకాశం వచ్చింది. జాబ్ చిన్నదైనా పెద్దదైనా సెక్యూరిటీ ఉండాలని చూస్తుంటారు. అందుకే యూత్ అంతా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు మస్త్ డిమాండ్ ఉంటుంది. అటెండర్ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వారు ఎంతోమంది ఉన్నారు. మీరు మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ఇలాంటి అవకాశం లైఫ్ లో మళ్లీరాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 2 లక్షల జీతం అందుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీటీడీలో రెండేళ్లపాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈపోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ లేదా రెలీజియస్‌ ఆర్గనైజేషన్‌ తదితరాల విభాగంలో 10 నుంచి 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఐటీ/ అనలిటికల్‌/ కమ్యూనికేషన్‌ తదితరాల్లో నైపుణ్యం కూడా ఉండాలి.

అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.2 లక్షలతో జీతంతో పాటు వసతి, ల్యాప్‌టాప్ సౌకర్యం కల్పిస్తారు. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు తిరుపతి లేదా తిరుమలలో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 7వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్, పాత అలిపిరి గెస్ట్ హౌస్, తిరుపతి చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ www.tirumala.org/ను సందర్శించాల్సి ఉంటుంది.